English   

విజయ్ దేవరకొండతో హెబ్బా పటేల్.. 

Vijay-Devarakonda
2018-10-24 12:10:58

ఏంటీ సర్ ప్రైజ్ అయ్యారా.. విజయ్ దేవరకొండతో హెబ్బాపటేల్ ఏంటీ అని.. కానీ కొన్నిసార్లు అలా అనుకోకుండా కుదురుతుంది. నిజానికి ఈ ఇద్దరి కాంబినేషన్ గతంలోనే సెట్ కావాల్సింది. అర్జున్ రెడ్డి చూసినప్పుడు చాలామంది హెబ్బా పటేల్ అయితే ఇంకా బావుండేది అనుకున్నారు. తర్వాతైనా సెట్ అవుతుందనకుంటే.. హెబ్బా సడెన్ గా డౌన్ అయింది. విజయ్ దూసుకుుపోతున్నాడు. అప్పుడు కుదరలేదు. అలాగని ఇప్పుడూ కుదిరింది అని చెప్పలేం. కాకపోతే ఇద్దరూ కలిసి వస్తున్నారు.  ఇంతకీ మేటర్ ఏంటంటే.. హెబ్బా పటేల్, విజయ్ దేవరకొండ కలిసి నటించడం లేదు.. కలిసి వస్తున్నారు. యస్.. నవంబర్ 16న విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ విడుదల కాబోతోంది. అదే  రోజు హెబ్బా పటేల్ నటించిన ‘24 కిస్సెస్’ అనే సినిమా కూడా అదే రోజు విడుదల కాబోతోంది.  మిణుగురులు ఫేమ్ అయోధ్యకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. అలాగే హెబ్బాకు కమ్ బ్యాక్ మూవీలా కనిపిస్తోంది. టైటిల్ లో ముద్దుులు ఉన్నా అవి సినిమాలో వల్గర్ గా ఉండవుఅనేలా ఉంది ట్రైలర్.  ఇక నోటా ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ సడెన్ గా టాక్సీని రంగంలోకి దింపాడు. ఈ మూవీపైనా పెద్దగా పాజిటివ్ బజ్ లేదు. అయినా విజయ్ క్రేజ్ తో వర్కవుట్ అవుతుందనుకుంటున్నారు. బట్.. విజయ్ తో పోటీ పడేంత సీన్ హెబ్బాకు కానీ.. ఆమె 24 ముద్దులకు కానీ ఉందా.. అనేదే అసలు ప్రశ్న..

More Related Stories