English   

దిల్ రాజు వెంటపడుతోన్న స్టార్ హీరోలు

dilraju-96
2018-10-24 12:21:39

అసలే దిల్ రాజు ఫ్లాపుల్లో ఉంటే అతని వెంట స్టార్ హీరోలు పడటం ఏంటీ అనుకుంటున్నారా.. అక్కడే ఉంది ట్విస్ట్.. ఆ ట్విస్ట్ పేరు ‘96’. యస్.. ఈ 96అనే మూవీ కోసం మన స్టార్ హీరోలు దిల్ రాజు వెంట పరుగులుపెడుతున్నారట. ఇది తమిళ సినిమా. ఈ నెల ఫస్ట్ వీక్ లో విడుదలైంది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ మూవీకి అక్కడ హార్ట్ మెల్టింగ్ అన్న పేరు వచ్చింది. ఫీల్ గుడ్ స్టోరీగా ఎందరో విమర్శకులకు సైతం నచ్చింది. అలాంటి సినిమాను దిల్ రాజు విడుదలకు ముందేకొనేశాడు. అతనికి బాగా నచ్చింది. దీంతో ఈ మూవీని తమిళ వెర్షన్ కూడా హైదరాబాద్ లో విడుదల కానివ్వలేదు. తనిక్కడ రీమేక్ చేయాలనుకుంటున్నాడు.

నిజానికి ఈ మూవీలో నాని, సమంత నటిస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ సమంత నేను నటించడం లేదు అని ఆ మధ్య ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. అటునానికూడా ఇంకా ఏమీ తేల్చలేదు. సినిమా నచ్చింది అని మాత్రం చెప్పాడట. ఈ లోగా మరికొందరు యంగ్ స్టార్స్ ఈ మూవీని చూశారు. అందరికీ తెగ నచ్చింది. దీంతో ఈ తెలుగు రీమేక్ లో నటించాలని.. ఎవరికి వాళ్లే ప్రయత్నిస్తున్నట్టు టాక్. ఈ మూవీ రీమేక్ లో నటించాలనుకుంటోన్న స్టార్స్ లో విజయ్ దేవరకొండ కూడా ఉండటం విశేషం. విజయ్ నోటా విడుదలైన రోజే ఇదీ విడుదలైంంది. అయినా విజయ్ కి ఈ మూవీ బాగా నచ్చిందట. అందుకే నేను చేస్తా అని ఇన్ డైరెక్ట్ గా దిల్ రాజుకు చేరేలా సంకేతాలిస్తున్నట్టు టాక్.  అటు శర్వానంద్ కూడా ఈ మూవీపై మోజుపడ్డట్టు చెబుతున్నారు. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీ ఆల్రెడీ చేసి ఉన్నాడు శర్వానంద్. తనకైతే టైలర్ మేడ్ అవుతుందనేది అతని ఫీలింగట. పైగా సినిమా బాగా నచ్చిందతనికి.. మరోవైపు నాని కూడా చేయడానికి సిద్ధంగానే ఉన్నట్టు టాక్. మరి ఈ 96 లో వీరికి ఏం నచ్చిందో.. ఫైనల్ గా ముగ్గురిలోఎవరికి దక్కుతుందో కానీ.. ఇలా దిల్ రాజు వెంట యంగ్ స్టర్స్ పడటం మాత్రం ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైమ్.. 

More Related Stories