English   

ఎన్టీఆర్, రామ్ చరణ్.. రాజమౌళి సినిమాకు నో చెప్పారు

Ram-Charan-NTR
2018-10-24 15:01:44

యస్.. మీరు చదివింది కరెక్టే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి సినిమాకు నో చెప్పారు. మరి ఎందుకు చెప్పారు.. ఏ విషయంలో చెప్పారు అనేది కూడా చూద్దాం.. ముందుగా ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా అనగానే చాలామంది ఎగ్జైట్ అయ్యారు. అసలు బాహుబలి తర్వాత రాజమౌళితో సినిమా ఛాన్స్ వస్తే ఏ ఒక్కరూ కాదనలేని పరిస్థితి ఉందిప్పుడు. అలాంటిది ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ కు ప్లాన్ చేశాడంటే ఖచ్చితంగా ఇది టాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేస్తుందనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అదిరిపోయే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాడు. మొత్తంగా మరికొన్ని రోజుల్లో షూటింగ్ స్టార్ట్ కాబోతోందనుకుంటోన్న టైమ్ లో సడెన్ గా ఈ షాకింగ్ న్యూస్ చెప్పారు. ‘ఆర్ఆర్ఆర్’ అని ముద్దుగా వర్కింగ్ టైటిల్ పెట్టుకున్న ఈ ‘ఆర్ క్యూబ్’ సడెన్ గా ఈ మూవీ కోసం మరో ఆర్ ను తొలగించారు. 

మరి వీళ్లు తొలగించిన ఆ ‘ఆర్’ ఏంటో తెలుసా.. రెమ్యూనరేషన్.. యస్.. ఎన్టీఆర్, రామ్ చరణ్.. రాజమౌళి సినిమాకు రెమ్యూనరేషన్ కు నో చెప్పారు. అలాగని రాజమౌళి సినిమాలో ఛాన్స్ రావడమే ఎక్కువ అందుకే రెమ్యూనరేషన్ వద్దనుకున్నారేమో అనుకోవడానికి లేదు. వీళ్లు వద్దనుకుంది కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే.. డబ్బులు కాదు. మళ్లీ ఇదేంటీ అనుకుంటున్నారా.. వెరీ సింపుల్.. ఈ భారీ మల్టీస్టారర్ మూవీకి భారీ బడ్జెట్ కూడా ఉంది. డి.వి.వి. దానయ్య నిర్మించబోతోన్న ఈ ప్రాజెక్ట్ కు మొత్తం 300 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అయితే స్టార్ హీరోలు ముందే రెమ్యూనరేషన్ తీసుకుంటే ప్రొడక్షన్ కోసం నిర్మాత ఇబ్బంది పడతాడు. అందుకే వీళ్లు రెమ్యూనరేషన్ వద్దనుకున్నారు. కానీ లాభాల్లో వాటా ఉంటుందట. నిజానికి వీళ్లు రెమ్యూనరేషన్ తీసుకునే కంటే లాభాల్లో వాటా తీసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే బాహుబలి తర్వాత రాజమౌళి రేంజ్ ఏరేంజ్ లో మారిందో అందరికీ తెలుసు. అలాగే ఈ ఇద్దరికీ తక్కువ మార్కెట్టేం లేదు. అలా చూస్తే 300 కోట్ల బడ్జెట్ కు మూడు రెట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదు. అంటే అంత పెద్ద లాభాల నుంచి వాటా అంటే రెమ్యూనరేషన్ కు డబుల్ రేంజ్ లో వస్తుంది కదా.. సో.. ఆర్ఆర్ఆర్ మూవీ కోసం  ఎన్టీఆర్, రామ్ చరణ్ రెమ్యూనరేషన్ వద్దన్నారన్నమాట. 

More Related Stories