English   

రామ్ చరణ్ మళయాలంలో పాగా వేస్తాడా..?

Ram-Charan
2018-10-24 10:55:01

ఓ భాషలో స్టార్ హీరో మరో భాషలో స్మాల్ హీరో అంటారు. కానీ కొంతమంది మాత్రమే ఇతర భాషల్లోనూ స్టార్డమ్ తెచ్చుకుంటారు. తెలుగు నుంచి మాలీవుడ్ లో అలాంటి ఇమేజ్ తెచ్చుకున్న ఒకే ఒక్క స్టార్ అల్లు అర్జున్. అతన్ని ఏకంగా మల్లు అర్జున్ అంటారక్కడ. ఇప్పటి వరకూ ఇందులో సగం మార్కెట్ కూడా లేదు రామ్ చరణ్ కు అక్కడ. కానీ ఈ సారి వచ్చేలా ఉంది. కారణమేంటో తెలుసా.. అక్కడికి చరణ్ చిట్టిబాబుగా వెళుతున్నాడు. తెలుగులో నాన్ బాహుబలి రికార్డ్స్ తిరగరాసిన సినిమా రంగస్థలం.. ఇప్పుడు మళయాలంలో డబ్ కాబోతోంది. రామ్ చరణ్ కు కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచే రంగస్థలంతో అతను మళయాలంలోనూ మార్కెట్ పెంచుకునే అవకాశాలున్నాయి.

కారణం.. ఈ కథ వారికి కూడా చాలా వరకూ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి.  సుకుమార్ చేసిన మ్యాజిక్ కు మళయాల ప్రేక్షకులు ఖచ్చితంగా ఫిదా అవుతారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ కు మాలీవుడ్ లో మంచి స్కోప్ ఉంటుంది. అక్కడి స్టార్ హీరోలు కూడా ఎక్కువ శాతం విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేసిన వారే. చేస్తున్నారు కూడా. అందుకే రంగస్థలం ఖచ్చితంగా అక్కడి ప్రేక్షఖులను మెప్పించే అవకాశం ఉంది.  ఇక ఈ సినిమాను మళయాలంలో కూడా మైత్రీ మూవీస్ వారే విడుదల చేయబోతుండటం విశేషం. ఈ నవంబర్ లో విడుదల చేస్తున్నామని వారే ప్రకటించారు. అక్కడ కూడా సేమ్ టైటిల్ పెట్టేశారు. మొత్తంగా రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ల నట వైదుష్యానికి తెలుగు తెర బిగ్గెస్ట్ హిట్ కట్టబెట్టింది. మరి అక్కడ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఒకవేళ మాలీవుడ్ లో కూడా రంగస్థలం హిట్ అయితే తర్వాత రామ్ చరణ్ కు అక్కడ మార్కెట్ ఇంకా బాగా పెరుగుతుంది. 

More Related Stories