English   

సవ్యసాచి ఎలా ఉండబోతుందో చూపించిన చైతూ

Naga Chaitanya’s Savyasachi Trailer Talk and Review
2018-10-24 20:38:50

అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘సవ్యసాచి’. చందు మొండేటి డైరెక్ట్ చేస్తోన్న  ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన గా నటిస్తోంది. భూమిక చావ్లా ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. మాధవన్ విలన్ గా తొలిసారి తెలుగు తెరపై కనిపించబోతున్నాడు. మొత్తంగా క్రేజీ ప్రాజెక్ట్ గా మొదలైన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ముందు నుంచీ బలమైన కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రాధాన్యం ఇస్తోన్న చందు మొండేటి మరోసారి అలాంటి మంచి కంటెంట్ తోనే వస్తున్నట్టుగా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఆ మధ్య టీజర్ తోనే ఇంప్రెస్ చేసిన చందు.. ఈ ట్రైలర్ తో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అన్న హింట్ ఇచ్చాడు. నిజంగానే కంటెంట్ ఉన్న ట్రైలర్ అనిపించుకుంది.

ఓ సాధారణ లైఫ్ గడిపేస్తోన్న కుర్రాడి లైఫ్ లో అనూహ్య పరిణామాలు జరగడం.. వాటి వెనక తనకు తెలియని ఓ విలన్ ఉండటం అనేది ఫార్ములాగా కనిపిస్తోంది. ఇది మనకు పాత ఫార్ములానే. కానీ దీనికి హీరో ఎడమచేయికి తెలియని బలం ఉంటుంది. అనే సైంటిఫిక్ రీజన్ యాడ్ చేసిన చందు ఆ దిశగా ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ‘ప్రేమ కోపం లాంటి ఇమోషన్స్ మీకు వస్తే మీరు మాత్రమే రియాక్ట్ అవుతారు... అదే నాకు వస్తే.. నాతో పాటు ఇంకొక్కడు కూడా రియాక్ట్ అవుతాడు...’ అనే డైలాగ్ లోనే ఈ కథలోని బలమైన పాయింట్ ఉంది. మొత్తంగా ఈ కంటెంట్ నచ్చడం వల్లే కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. నవంబర్ 2న విడుదల కాబోతోన్న సవ్యసాచిపై ఈ ట్రైలర్ అంచనాలు పెంచిందనే చెప్పాలి.

More Related Stories