English   

అర‌వింద స‌మేత‌.. హ‌లో గురు పరిస్థితేంటి..?

Aravinda Sametha Hello Guru Prema Kosame Box Office Collections
2018-10-25 07:09:25

ద‌స‌రా హాలీడేస్ అయిపోయాయి.. ఇప్ప‌టికే మ‌రో మూడు రోజులు పూర్త‌య్యాయి కూడా. దాంతో గ‌త రెండు వారాలుగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి చేస్తున్న అర‌వింద స‌మేత‌.. గ‌త వారం విడుద‌లైన హ‌లో గురు ప్రేమ‌కోస‌మే సినిమాల ప‌రిస్థితి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్ష‌కుల‌ను బాగానే అలరించాయి కానీ వ‌సూళ్ల విష‌యంలో మాత్రం కాస్త నిరాశ ప‌రిచాయి. ముఖ్యంగా అర‌వింద స‌మేత రికార్డుల వేట‌తో ఆరంభించింది. అయితే వారం రోజుల పాటు నాన్ స్టాప్ ర‌చ్చ చేసిన వీర‌రాఘ‌వ‌.. వారం త‌ర్వాత చ‌ల్ల‌బ‌డ్డాడు. రెండో వీకెండ్ లో మ‌ళ్లీ కాస్త పుంజుకుని ప‌ర్లేద‌నిపించింది ఈ చిత్రం. ఇప్ప‌టి వ‌ర‌కు 11 రోజుల్లో 91.60 కోట్ల షేర్ వ‌సూలు చేసింది అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌. ఈ చిత్రాన్ని 93 కోట్ల‌కు అమ్మారు. అంటే ఈ వారం కూడా ఎలాగోలా నెట్టుకొచ్చి అమ్మిన రేట్ల‌ను వెన‌క్కి తెస్తుంది అర‌వింద స‌మేత‌. అయితే ఏరియాల వైజ్ గా చూస్తే మాత్రం ఈ చిత్రం చాలాచోట్ల న‌ష్టాల‌నే మిగులుస్తుంది.

క‌ర్ణాట‌క‌, నైజాం, త‌మిళ‌నాడుల్లో సినిమా హిట్ అయింది.. కానీ మిగిలిన చోట్ల మాత్రం కొద్దిగా న‌ష్టాలు తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది అర‌వింద స‌మేత‌. ఇక ఓవ‌ర్సీస్ లో అయితే క‌న్ఫ‌ర్మ్ గా వీర‌రాఘ‌వ చేతులెత్తేసాడు. అక్క‌డ 2 మిలియ‌న్ దాటినా కూడా అమ్మిన రేట్ల ప్ర‌కారం 3 మిలియ‌న్ వ‌స్తేనే సేఫ్. అందుకే అక్క‌డ ప్లాప్. ఇక హ‌లో గురు ప్రేమ‌కోస‌మే 5 రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా 15 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. కానీ ఈ సినిమా సేఫ్ కావాలంటే రావాల్సింది 24 కోట్లు. అంటే మ‌రో 9 కోట్లు బాకీ అన్న‌మాట‌. ఇప్పుడున్న టాక్.. వ‌స్తున్న క‌లెక్ష‌న్స్ చూస్తుంటే అది క‌ష్ట‌మే. అంటే దిల్ రాజుకు 2018లో మిగిలింది రిక్త‌హ‌స్తమే. ఒక్క విజ‌యం కూడా లేకుండానే ఈ ఏడాది ముగిస్తున్నాడు రాజు. మొత్తానికి అటు అర‌వింద స‌మేత‌.. ఇటు హ‌లో గురు ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకున్న‌ట్లే అందుకుని.. ఆ త‌ర్వాత కాస్త వెన‌క్కి త‌గ్గేసాయి.

More Related Stories