English   

డైలామాలో విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్

Vijay Devarakonda Career in Dilemma After NOTA Flop
2018-10-25 07:32:48

నెల రోజుల కింద వ‌ర‌కు కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ట్రెండ్ సెట్ట‌ర్. ఆయ‌న న‌టిస్తే సినిమా హిట్ అంతే.. క‌నీసం గెస్ట్ రోల్ చేసినా కూడా చ‌రిత్ర సృష్టిస్తాడు.. దానికి మ‌హాన‌టి సాక్ష్యం. ఇక గీత‌గోవిందం అంటే ఏకంగా 70 కోట్ల షేర్ తీసుకొచ్చి.. తెలుగు సినిమా చ‌రిత్రలోనే అత్య‌ధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఇంత‌గా ఫాలోయింగ్ పెంచుకున్నాడు విజ‌య్. కానీ అవ‌న్నీ ఒక్క నోటా సినిమాతో పోయాయి. విజ‌య్ కూడా నార్మ‌ల్ హీరోనే.. సూప‌ర్ మ్యాన్ కాదంటూ నీరు కార్చేసాయి. ఈ సినిమా ఫ్లాప్ త‌ర్వాత ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైన ట్యాక్సీవాలాపై కూడా ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాలు అయితే క‌నిపించ‌డం లేదు. దానికి కార‌ణం ఒక్క‌టే.. ఈ సినిమా మూడు నెల‌లుగా వాయిదా ప‌డుతూ రావ‌డ‌మే. జూన్ లోనే రావాల్సిన ఈ చిత్రాన్ని అప్పుడు గీత‌గోవిందం కోసం.. ఆ త‌ర్వాత నోటా కోసం ఆపారు.

ఈ రెండు సినిమాల్లో గీతగోవిందం విజ‌య్ ద‌శ‌ను మార్చేసింది కానీ నోటా మాత్రం ముంచేసింది. ఇప్పుడు ట్యాక్సీవాలా కానీ ఏదైనా తేడా కొడితే చేజేతులా మంచి కెరీర్ ను విజ‌య్ దేవ‌ర‌కొండ ముంచేసుకున్న‌వాడు అవుతాడు. ఎందుకంటే ట్యాక్సీవాలా త‌ర్వాత కూడా కొత్త ద‌ర్శ‌కుడితో డియ‌ర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు విజ‌య్. దీనిపై కూడా అంచ‌నాలు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఇక వాటితో పాటు ఫ్లాప్ డైరెక్ట‌ర్ క్రాంతిమాధ‌వ్ తో ఓ సినిమా ఒప్పుకున్నాడు విజయ్. ఇలా అన్నీ రిస్కులు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఇందులో ఏది విజ‌య్ దేర‌వ‌కొండ కోరుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ ఇస్తుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక్క హిట్ ప‌డినా కూడా మ‌ళ్లీ విజ‌య్ ఈజ్ బ్యాక్ అంటారు కానీ ఒక్క ప్లాప్ ప‌డిందంటే నిజంగానే విజ‌య్ గోయింగ్ బ్యాక్ అంటారు. మ‌రి చూడాలి.. ఈ డైల‌మాలోంచి విజ‌య్ ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడో..?

More Related Stories