English   

స‌వ్య‌సాచి.. మిక్చ‌ర్ ఆఫ్ ఆల్ ఎమోష‌న్స్.

Naga Chaitanya’s Savyasachi MIxture of All Emotions
2018-10-25 09:17:45

ఓ సినిమా నుంచి అయితే ఎమోష‌న్.. లేదంటే కామెడీ.. అదీ కాదంటే ల‌వ్.. ఇలా ఏదో ఒక‌టి ఊహిస్తాం. కానీ అన్ని ఉన్న సినిమాలు ఇప్పుడు రావ‌డం గ‌గ‌నం అయిపోయింది. ఏదో ఒక్క‌టి ఉండ‌ట‌మే క‌ష్టం అనుకుంటుంటే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లా అన్నీ క‌లిపి తీసుకొస్తున్నాడు చందూ మొండేటి. స‌వ్య‌సాచి ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత ఇదే అర్థ‌మ‌వుతుంది. అందుకే ఈ ట్రైల‌ర్ కు అంత‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. చైతూ ఇమేజ్ తో ప‌ని లేకుండా విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే 10 ల‌క్ష‌ల వ్యూస్ అందుకుంది ఈ చిత్ర ట్రైల‌ర్. చూస్తుంటే ఈ చిత్రం ఖచ్చితంగా చైతూ కెరీర్ ను మార్చేసేలా క‌నిపిస్తుంది. కాస్త ఆల‌స్యం అయినా కూడా అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు చందూ.

స‌వ్య‌సాచి మొద‌లుపెట్టిన‌పుడు త‌న కెరీర్ ను మ‌రో స్థాయికి తీసుకెళ్లే సినిమా ఇదే అని న‌మ్మాడు చైతూ. అయితే స‌వ్య‌సాచి ఆల‌స్య‌మ‌వుతున్న తీరు చూసి ఇదే త‌న కెరీర్ కు ఎక్క‌డ అడ్డంకిగా మారుతుందో అని టెన్ష‌న్ కూడా ప‌డుతున్నాడు ఈ హీరో. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్ లో ఎప్పుడూ లేనంత బ‌డ్జెట్ తో ఈ సినిమా చేస్తున్నాడు. పైగా ప్రేమ‌మ్ త‌ర్వాత చందూ మొండేటితో చైతూ చేస్తోన్న సినిమా ఇది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా భారీగా ఉన్నాయి. ఇందులో ఎడ‌మ చేయితో హీరో బాడీకి సంబంధం ఉండ‌దు. ఇలాంటి క‌థ‌తో నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి వ‌స్తుంది. అయితే ఇన్నాళ్ల భ‌యం అంతా ఇప్పుడు ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత పోయింది.

ఖచ్చితంగా తాము ప‌డిన క‌ష్టానికి ఫ‌లితం మాత్రం అద్భుతంగా వ‌స్తుంద‌ని ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత న‌మ్ముతున్నాడు చైతూ. రెండు చేతుల‌కు స‌మాన‌మైన బ‌లం ఉన్న‌వాన్ని స‌వ్య‌సాచి అంటారు. ఇదే స‌వ్య‌సాచి కాన్సెప్ట్. కుడిచేయికి.. ఎడ‌మ‌చేయికి అస‌లు బాడీతో సంబంధం ఉండ‌దు. తాను చేయాల‌నుకున్న‌ది అది చేస్తూ పోతుంది. దీనివ‌ల్ల హీరోకు ఎలాంటి క‌ష్టాలు వ‌చ్చాయి అనేది క‌థ‌. విన‌డానికే చాలా కొత్త‌గా ఉంది ఈ క‌థ‌. దీన్ని స‌రిగ్గా చెబితే తెలుగులో ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అయిపోతుంది స‌వ్య‌సాచి.

More Related Stories