English   

ఈ మాధవ‌న్ అత‌డేనా.. ఏంటా రాక్ష‌స‌త్వం..? 

Madhavan
2018-10-25 04:40:24

మాధ‌వ‌న్.. ఈ పేరు తెలియ‌ని వాళ్లుండ‌రేమో..? ఒక‌ప్పుడు అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు. ఇప్పుడు భిన్నమైన సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్. హీరోగా ఇమేజ్ ఉండి కూడా కంటెంట్ ఉన్న సినిమాల్లో మాత్రమే న‌టిస్తున్నాడు మ్యాడీ. ఈ మ‌ధ్య కాలంలో మ‌రీ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. గ‌త రెండు మూడేళ్ల‌లో సాలాఖ‌డూస్.. త‌నూవెడ్స్ మ‌నూ రిట‌ర్న్స్.. విక్ర‌మ్ వేధ లాంటి సినిమాలు చేసాడు మాధ‌వ‌న్. అంతేకాదు.. ఈయ‌నకు భాషా భేదాలు లేవు. ఇప్ప‌టికే తమిళ్ తో పాటు మ‌ళ‌యాల‌, హిందీల్లోనూ న‌టించాడు. ఇక ఇప్పుడు తెలుగులో నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇన్నాళ్లూ ఈ చిత్రంలో మాధవ‌న్ చేసేది ఎలాంటి పాత్రో తెలియ‌క క‌న్ఫ్యూజ్ అయ్యారు ప్రేక్ష‌కులు. ఇప్పుడు ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత విల‌న్ అని క‌న్ఫ‌ర్మ్ చేసుకున్నారు. 

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళనాట కూడా విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు చందూమొండేటి. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. ఇందులో మాధ‌వ‌న్ పాత్ర‌ను చాలా కొత్త‌గా డిజైన్ చేసాడు చందూ మొండేటి. ట్రైల‌ర్ లో కూడా స్మార్ట్ గా క‌నిపిస్తూనే రాక్ష‌సంగానూ ఉన్నాడు. నిన్న‌టిత‌రం అంద‌గాళ్లంతా ఇప్పుడు ఇలా విల‌న్లుగా మారిపోతుంటే చూడ్డానికి చాలా ముచ్చ‌టేస్తుంది. అర‌వింద్ స్వామి ఇప్ప‌టికే విల‌న్ గా ర‌ప్పాడిస్తున్నాడు.. ఇక ఇప్పుడు మాధ‌వ‌న్ కూడా మారిపోయాడు. మ‌న ద‌గ్గ‌ర ఇప్ప‌టికే శ్రీ‌కాంత్.. జ‌గ‌ప‌తిబాబు కూడా విల‌న్లుగా మారిపోయారు. మొత్తానికి ఒక‌ప్ప‌టి అంద‌గాళ్లే.. నేటి విల‌న్లు అన్న‌మాట‌. మ‌రి సవ్య‌సాచి విడుద‌లైన త‌ర్వాత మ్యాడీ వెంట ఎంత‌మంది ద‌ర్శ‌కులు క్యూ క‌డ‌తారో చూడాలిక‌..!

More Related Stories