English   

హ్యాట్రిక్ కొడితే చందూకు తిరుగుండ‌దు.. 

Chandoo-Mondeti
2018-10-25 13:30:36

తెలుగు ఇండ‌స్ట్రీలో తొలి మూడు సినిమాల‌తో వ‌ర‌స విజ‌యాలు అందుకున్న ద‌ర్శ‌కులు చాలా అరుదుగా ఉన్నారు. రాజ‌మౌళి.. బోయ‌పాటి శీను.. కొర‌టాల‌.. అనిల్ రావిపూడి లాంటి ద‌ర్శ‌కులు త‌ప్ప ఈ మ‌ధ్య కాలంలో ఈ రికార్డ్ అందుకున్న‌ది ఎవ‌రూ లేరు. ఇప్పుడు చందూమొండేటి ముందు ఈ ఆప్ష‌న్ నిలిచింది. ఈయ‌న కూడా తొలి రెండు సినిమాల‌తో హిట్ కొట్టాడు. కార్తికేయ‌తో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టి.. ప్రేమ‌మ్ తో మంచి విజ‌యం అందుకున్నాడు. ఇక ఇప్పుడు మూడో సినిమాగా స‌వ్య‌సాచితో వ‌స్తున్నాడు. ఈ చిత్రం ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత క‌చ్చితంగా హ్యాట్రిక్ ఖాయం అనే న‌మ్మ‌కంతో ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఓ సారి స‌క్సెస్ ఇచ్చిన ద‌ర్శ‌కుల్ని హీరోలు వ‌ద‌ల‌డం లేదు. అలాగే స‌క్సెస్ ఫుల్ హీరోల‌ను ద‌ర్శ‌కులు కూడా దూరం చేసుకోవాల‌నుకోవ‌ట్లేదు. 

అందుకే రిపీటెడ్ కాంబినేష‌న్స్ ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఎక్కువైపోయాయి. ఇప్పుడు చైతూ-చందూ కూడా అంతే. ప్రేమ‌మ్ త‌ర్వాత స‌వ్య‌సాచికి ప‌ని చేసారు ఈ ఇద్ద‌రూ. ప్రేమ‌మ్ అది రీమేక్ సినిమా అయినా.. త‌న‌దైన శైలిలో అద్భుతంగా తెర‌కెక్కించాడు చందూ. చైతూకు కావాల్సిన స‌క్సెస్ ను ఆ సినిమాతో ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. దాంతో చందూ వ‌ర్కింగ్ స్టైల్ న‌చ్చి ఈ సారి సొంత క‌థ‌తో స‌వ్య‌సాచి చేసాడు నాగ‌చైత‌న్య‌. ఇప్పుడు ఇండ‌స్ట్రీ అంతా ఈ సినిమా కోసం చూస్తుంది. దానికి కార‌ణం అందులో ఆయ‌న తీసుకున్న కాన్సెప్ట్. అది కానీ ప‌క్కా వ‌ర్క‌వుట్ అయిందంటే చందూమొండేటి ట్రెండ్ సెట్ట‌ర్ అయిపోతాడు. మ‌రి చూడాలిక‌.. ఈ ద‌ర్శ‌కుడు హ్యాట్రిక్ అందుకుంటాడో లేదో..? 

More Related Stories