English   

రామ్ చరణ్ ఇక్కడ హిట్ కాలేకపోయాడు.. 

Rangasthalam-TRP
2018-10-25 18:53:42

రామ్ చరణ్.. ఒకేఒక్కసినిమాతో తనపై వచ్చిన అన్ని రూమర్స్ కు చెక్ పెట్టాడు. వారస హీరో అని గేలి చేసిన వారికి తనలోఎంత గొప్ప నటుడున్నాడో రంగస్థలంతో చూపించాడు. రంగస్థలం మ్యాజిక్ కు బాక్సాఫీస్ కూడా షేక్ అయిపోయింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రస్తుతంఅన్ని నాన్ బాహుబలి రికార్డ్స్ ను సెట్ చేసింది. రామ్ చరణ్ అద్భుతమైన నటనకు ఆడియన్స్ ఫిదా అయిన వేళ.. రంగస్థలం అటు క్రిటిక్స్ ను సైతం మెస్మరైజ్ చేసింది. మొత్తంగా రామ్ చరణ్ తో పాటు సమంత, జగపతిబాబు, అనసూయల పాత్రలు సినిమాకే హైలెట్ గా నిలవగా.. ప్రకాష్ రాజ్ పాత్రతో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ ఓ రేంజ్ లో క్లిక్ అయింది. ఇక విడుదలైన అన్ని ఫార్మాట్స్ లో ఆకట్టుకున్న రంగస్థలం లేటెస్ట్ గా ఎక్కువ అంచనాలున్న చోట అవి నిలబెట్టకోలేకపోయింది.  

రీసెంట్ గా రంగస్థలం.. మా టివిలో టెలికాస్ట్ అయింది. అయితే ఈ మూవీకి అద్భుతమైన రేటింగ్ వస్తుందని చాలామంది భావించారు. పైగా రికార్డుులు తిరగరాస్తుందనుకున్నారు. బట్ అవేవీ జరగలేదు. అలాగని రేటింగ్ కూడ తక్కువేం రాలేదు. కాకపోతే కలెక్షన్స్ విషయంలో నాన్ బాహుబలి అన్న రంగస్థలం రేటింగ్ లో ఆ ఫీట్ సాధించలేకపోయింది.

రంగస్థలం చిత్రానికి 19.5 రేటింగ్ వచ్చింది. కానీ ప్రస్తుతం టాప్ ఒన్, టూ లో బాహుబలి ఉంది.తర్వాత ప్లేస్ లో చాలా సినిమాలున్నాయి. రంగస్థలం కంటే ముందు కూడా జనతా గ్యారేజ్ ఉంది. ఈ లెక్కన రంగస్థలం దాదాపు 8వ స్థానంలో నిలిచిందని చెప్పొచ్చు. కాకపోతే ఈ మూవీకి పైరసీ బెడద ఎక్కువగా ఉండేది. అలాగే చాలా తక్కువ టైమ్ లోనే డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ వచ్చేసింది. దీంతో టివిలో పెద్దగా రేటింగ్ తెచ్చుకోలేకపోయింది. 

More Related Stories