English   

క‌త్రినా కైఫ్.. క‌త్తి లాంటి కైపు.. 

Katrina-Suraiyya
2018-10-25 19:03:20

పేరులోనే క‌త్తి ఉంది.. కైపు ఉంది.. ఇక ఎందుకు ఊరికే ఉంటుంది చెప్పండి. అందుకే పేరుకు త‌గ్గ‌ట్లుగానే క‌త్తి లాంటి కైపుల‌తో చూపులు తిప్పుకోని అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తుంది క‌త్రినా కైఫ్. మొన్న‌టి వ‌ర‌కు ఉనికి కాపాడుకోడానికి అందాలు అడ్డు పెట్టిన క‌త్రినా ఇప్పుడు మాత్రం నెంబ‌ర్ వ‌న్ పీఠం కోసం పోరాడుతుంది. ఇప్ప‌టికీ త‌నలో ఏ మాత్రం గ్లామ‌ర్ త‌గ్గ‌లేద‌ని నిరూపించుకుంటూనే ఉంది క‌త్రినా. తాజాగా మ‌రోసారి ఇదే చేసి చూపించింది. ప్ర‌స్తుతం ఈమె అమీర్ ఖాన్, అమితాబ్ బ‌చ్చ‌న్ థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో న‌టిస్తుంది. ఇందులోని ఐటం సాంగ్ విడుద‌లైంది. ఈ పాట‌లో న‌డుముతో నాట్యం చేసి చూపుల‌ను త‌న నాభి చుట్టూ క‌ట్టేసుకుంది క‌త్రినా కైఫ్. ఆ కైపులు చూస్తుంటే మ‌న‌కు కైపెక్క‌డం ఖాయం. ఈ చిత్రం న‌వంబ‌ర్ 6న విడుద‌ల కానుంది. 

అమీర్ తో పాటు స‌ల్మాన్ ఖాన్ తోనూ భ‌ర‌త్ సినిమాలో న‌టిస్తుంది క‌త్రినా. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే.. అప్పుడ‌ప్పుడూ హాట్ ఫోటోషూట్ ల‌తో ప్రేక్ష‌కుల గుండెలు గ‌ల్లంతు చేస్తోంది క‌త్రినా. మొహమాటం అనే ప‌దం క‌త్రినా డిక్ష‌న‌రీలోనే లేదు. అందాల ఆర‌బోత‌లో ఈ భామ పిహెచ్ డీ పూర్తిచేసింది ఈ భామ‌. ఎంత కావాలంటే అంత‌.. రెడీ అంటూ రెచ్చిపోతోంది ఈ ముద్దుగుమ్మ‌. మొన్నటికి మొన్న బికినీ ఫోటోషూట్ లో రెచ్చిపోయిన క్యాట్స్.. ఇప్పుడు ఐటం సాంగ్ తో అద‌ర‌గొట్టింది. 54 సెకన్ల పాట‌లో డాన్సులే హైలైట్ అయ్యాయి. కొత్త భామ‌ల ధాటికి కొన్నాళ్లు సైలెంట్ అయినా కూడా ఇప్పుడు మ‌ళ్లీ రెచ్చిపోతుంది క‌త్రినా. ఇన్నేళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ ఏ దేవుడో క‌రుణించిన‌ట్లున్నాడు. అందుకే క‌త్రినాకు వ‌ర‌స‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తూ రేస్ లోనే ఉంది క‌త్రినా కైఫ్. 

More Related Stories