English   

స్టార్ హీరోయిన్లను పక్కను నెడుతున్న కంగనా

Kangana Ranaut taking huge remuneration for Manikarnika
2018-10-25 21:45:53

కష్టే ఫలి.. అనే మాటకు అక్షరరూపం కంగనా రనౌత్. అమ్మడు ఒకప్పుడు ఆల్మోస్ట్ బి గ్రేడ్ సీన్స్  లో కూడా నటించింది. అప్పుడు తనకు పెద్దగా క్రేజ్ లేదు. పైగా అంత పెద్ద అందగత్తె కాదు. మరోవైపు బ్యాక్ గ్రౌండ్ ఉన్న లేడీ కాదు. ఇంటి నుంచి పారిపోయి వచ్చి బాలీవుడ్ కలలను నిజం చేసుకున్న ధీరవనిత. అందుకే తనేం మాట్లాడినా.. డేర్ గా ఉంటుంది. ఎవరినో మెప్పించడానికో.. ఇంకెవరినో ఇంప్రెస్ చేయడానికి తన మాటలు ఉండవు. మనసులో ఏది ఉంటే అదే బయటకు అనేస్తుంది. ఈ కారణంగా కూడా కంగనారనౌత్ బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఇక క్వీన్ సినిమా తర్వాత అమ్మడి దశ ఓ రేంజ్ లో తిరుగింది. ఆ మూవీ వంద కోట్లు సాధించడంతో పాటు క్రిటిక్స్  నుంచి చాలా ప్రశంసలు తెచ్చుకొంది ఈ సినిమా.. ఆ తర్వాత కంగనా ఏం చేసినా హిట్టే అన్నట్టగా పేరు పడిపోయింది. ఇదే ఇప్పుడు తనను బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ను చేసింది.

Kangana Ranaut Manikarnika

కంగనారనౌత్ టాప్ హీరోయిన్ ఏంటీ అనుకుంటున్నారా... నిజమే.. తను రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ వేషాలు వేయలేదు. కానీ.. తను వేస్తోన్న పాత్రలతోనే తనకంటూ తిరుగులేని మార్కెట్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో మరే హీరోయిన్ కు లేనంత క్రేజ్ తెచ్చుకుంది. దీంతో కంగనా ఇప్పుడు హయ్యొస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటోన్న బాలీవుడ్ బ్యూటీగా అవతరించింది.

Kangana Ranaut Deepika Padukone

నిజం.. ప్రస్తుతం బాలీవుడ్ లో హయ్యొస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటోన్న హీరోయిన్ కంగనా రనౌత్. ఇంతకు ముందు ఈ ప్లేస్ లో దీపికా పదుకొనె ఉంది. కానీ ప్రస్తుతం తను చేస్తోన్న మణికర్ణిక సినిమాకు కంగనా 14కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. దర్శకుడు క్రిష్ తప్పుకున్నా.. తను డైరెక్షన్ సీట్ లోనూ కూర్చుని మరీ ఈ సినిమాను పూర్తి చేస్తోంది. జనవరి 25న విడుదల కాబోతుంది మణికర్ణిక.

Kangana Ranaut Manikarnika Director Krish

More Related Stories