English   

వెంకీ మామా కోసం అల్లుడు రెడీ

Venkatesh Naga Chaitanya’s Venky Mama Movie Regular Shoot Start From Nov 12th
2018-10-26 07:01:40

తెలుగులో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చాలానే వ‌స్తున్నాయి. ముఖ్యంగా సీనియ‌ర్ హీరోలు వీటిని బాగానే ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఇప్పుడు నాగార్జున దేవదాస్ కానీ.. వెంక‌టేష్ ఇప్పుడు చేస్తోన్న ఎఫ్ 2 కానీ.. చిరంజీవి సైరా కానీ అన్నీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలే. ఇదే దారిలో ఇప్పుడు వెంకీ మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు. మేన‌ల్లుడు నాగ‌చైత‌న్యతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు వెంక‌టేష్. ప్రేమ‌మ్ లో కాసేపు మామ‌గా క‌నిపించి మాయం అయిపోయాడు వెంక‌టేష్. ఇప్పుడు పూర్తిగా ర‌చ్చ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న సినిమా షూటింగ్ న‌వంబ‌ర్ 12 నుంచి మొద‌లు కానుంది. జై ల‌వ‌కుశ త‌ర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని బాబీ చేస్తోన్న సినిమా ఇది. పూర్తిగా గ్రామ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది.

Venkatesh Naga CHaitanya Venky Mama

ఇందులో చైతూకు జోడీగా ర‌కుల్.. వెంకీకి జోడీగా కాలా ఫేమ్ హ్యూమా ఖురేషీ న‌టిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంట‌ర్టైనర్ గా వెంకీ మామాను తెర‌కెక్కించ‌నున్నాడు ద‌ర్శ‌కుడు బాబీ. ఈ సినిమాకు కూడా కోన వెంక‌ట్ త‌న ర‌చ‌నా స‌హ‌కారం అందించాడు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్నాయి. వెంకీ మామా కోసం స‌వ్య‌సాచి ప్ర‌మోష‌న్స్ ను కూడా త్యాగం చేస్తున్నాడు నాగ‌చైత‌న్య‌. న‌వంబ‌ర్ 2న ఈ చిత్రం విడుద‌ల కానుంది. అప్ప‌టికి ఈ సినిమా థియేట‌ర్స్ లో ఉన్నా కూడా సవ్య‌సాచిని కాద‌ని వెంకీ మామ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు నాగ‌చైత‌న్య‌. మరి ఈ ఫ్యామిలీ మ‌ల్టీస్టార‌ర్ ఎంత‌వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి..!

More Related Stories