English   

అయ్యో .. మహేష్ అమెరికా ఈవెంట్ కు ఎవ్వరూ రాలేదట

Superstar Mahesh Babu USA Event Cancelled due to Poor Ticket Sales
2018-10-26 08:04:08

మ‌హేష్ బాబు మ‌న‌కు సూప‌ర్ స్టార్.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రైన సినిమా ప‌డితే రికార్డులతో చెడుగుడు ఆడుకుంటాడు సూప‌ర్ స్టార్. ఇక ఓవ‌ర్సీస్ కింగ్ మ‌హేష్ బాబు. ఇవ‌న్నీ ఇక్క‌డ ఆయ‌న‌కు మనం పెట్టుకున్న ముద్దుపేర్లు. కానీ ఇప్పుడు అదే అమెరికాలో ఈయ‌న ప‌ప్పులేవీ ఉడ‌క‌లేదు. ఈవెనింగ్ విత్ సూప‌ర్ స్టార్ అంటూ ఫండ్ రైజ్ కోసం యుఎస్ లో ఓ ఈవెంట్ ప్లాన్ చేసారు. ఓ సోషల్ కాజ్ కోసం ఫండ్ రైజ్ చేయడం ఈ ఈవెంట్ ముఖ్య  ఉద్దేశం. మహేష్ బాబు దీనికి అంగీకరించాడు. ఆర్గనైజర్స్ అక్క‌డ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే చివ‌రికి వ‌చ్చే స‌రికి ఇప్పుడు ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. దానికి కార‌ణం కూడా టికెట్ సేల్స్ లేక‌పోవ‌డం వ‌ల్లే. ఒక్కో టికెట్ ఏకంగా 100 డాల‌ర్ల‌కు పైగా పెట్ట‌డంతో అక్క‌డి ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఈ షోపై ఆస‌క్తి చూపించ‌లేదు.

Superstar Mahesh Babu USA Event Cancelled due to Poor Ticket Sales

దాంతో నిర్వాహ‌కులు కేన్సిల్ చేసారు. దాంతో సూప‌ర్ స్టార్ షో ప‌ట్టాలెక్క‌కుండానే అట‌కెక్కింది. గ‌తంలో చిరంజీవికి కూడా ఇంచుమించు ఇలాంటి ప‌రాభ‌వ‌మే ఎదురైంది. అప్పుడు ఆయ‌న కూడా అమెరికా వెళ్లి షో చేసాడు. కానీ కేవ‌లం కోటి మాత్ర‌మే వ‌సూలు అయింది. దాంతో చిరు స్టామినా ఇంతేనా అంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు మ‌హేష్ షో అయితే క‌నీసం మొద‌ల‌వ్వ‌కుండా ఆగిపోయింది. మొత్తానికి సినిమాలు అయితే చూస్తాం కానీ ఇలా షోల‌కు వ‌చ్చి ఎంక‌రేజ్ చేయ‌డం త‌మ వ‌ల్ల కాదంటున్నారు ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్.

More Related Stories