English   

అయ్య‌య్యో ర‌కుల్ ది కూడా కొట్టేసారుగా..

Rakul Preet Singh Instagram Account Hacked
2018-10-26 09:20:23

అస‌లే ఈ మ‌ద్య దొంగ‌లు ఎక్కువైపోయారు. ఎక్క‌డ చూసినా నేర‌గాళ్లే క‌నిపిస్తున్నారు. అందులోనూ సోష‌ల్ మీడియా మొద‌లైన త‌ర్వాత సైబ‌ర్ నేర‌గాళ్ల జాబితా పెరిగిపోతుంది. వీళ్ల బారిన ప‌డి చాలా మంది జీవితాలు కూడా న‌లిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా వీళ్ల‌కు బ‌లైపోయింది. ఈమె ఇన్ స్టాగ్రామ్ ను ఎవ‌రో హ్యాక్ చేసారు. ర‌కుల్ ఇన్ స్టాగ్రామ్ హ్యాక్ అయిందంటూ రెండు రోజులుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అందులో నిజ‌మెంత అనేది మాత్రం ఎవ‌రికీ క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు ర‌కుల్ స్వ‌యంగా త‌న ఇన్ స్టాగ్రామ్ ఎవ‌రో హ్యాక్ చేసార‌ని చెప్ప‌డంతో షాక్ తిన‌డం అభిమానుల వంత‌యింది.

సెలెబ్రెటీస్ ప‌రిస్థితే ఇలా ఉంటే పాపం నార్మ‌ల్ పీపుల్ త‌మ సైబ‌ర్ చ‌రిత్ర గురించి చెప్ప‌డం తప్పు కాదేమో..? ఎందుకంటే వాళ్ల ప‌రిస్థితి మ‌రెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. త‌న ఇన్ స్టాగ్రామ్ ను హ్యాక్ చేసిన వాళ్ల‌ను త్వ‌ర‌గా ప‌ట్టుకోవాల‌ని సైబ‌ర్ డిపార్ట్ మెంట్ కు కంప్లైంట్ కూడా ఇచ్చింది ఈ బ్యూటీ. అది మిస్ యూజ్ కాకుండా చూసుకుంటుంది. అన్న‌ట్లు నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో ఖాళీగా ఉన్న‌ట్లు క‌నిపించిన ర‌కుల్.. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో శ్రీ‌దేవిగా.. వెంకీమామాలో నాగ‌చైత‌న్య ప్రేమికురాలిగా బిజీ అయిపోయింది. ఈ రెండు సినిమాల త‌ర్వాత మ‌రోసారి తెలుగులో వెలుగు వెలగాలని ఆశిద్దా.

More Related Stories