English   

కబీర్ సింగ్ గా అర్జున్ రెడ్డి 

Shahid-Kapoor
2018-10-26 11:05:44

విజయ్ దేవరకొండను స్టార్ ను చేసిన సినిమా అర్జున్ రెడ్డి. అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విజయ్ ని ఓవర్ నైట్ స్టార్ ను చేసింది. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా ఓ సినిమాతో విపరీతమైన ఫ్యాన్  ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోగా నిలిచాడు విజయ్. సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసినఈ మూవీని ఒక రకంగా దీన్ని టాలీవుడ్ గేమ్ చేంజింగ్ సినిమాగా చెప్పారు. శివ తర్వాత ఆ రేంజ్ లో ఆడియన్స్ ను ఊపేసిన సినిమా అన్నారు. నిజమే.. ట్రైలర్, పోస్టర్స్ చూసిన తర్వాత చాలామంది ఇది బిగ్రేడ్ సినిమా అనుకున్నారు. బట్ అందులోని ఇంటెన్షన్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు.  కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు.. ఓవరాల్ సౌత్ ను అట్రాక్ట్ చేశాడీ అర్జున్ రెడ్డి. అందుకే ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రీమేక్ అవుతోంది. ఆల్రెడీ తమిళ్ లో వర్మగా వస్తోన్న అర్జున్ రెడ్డి... బాలీవుడ్ లో కబీర్ సింగ్ అయ్యాడు. బాలీవుడ్ లోనూ ఈ మూవీని సందీప్ రెడ్డి వంగానే డైరెక్ట్ చేస్తున్నాడు. అక్కడ షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈసినిమా వచ్చిన టైమ్ తో పోలిస్తే సందీప్ ఈ రీమేక్ కోసమే చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇక్కడ ఎన్నో ఆఫర్స్ వచ్చినా.. కాదని అక్కడికి వెళ్లాడు. మొత్తంగా చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత మొదలైన ఈ మూవీకి.. హిందీలో ‘కబీర్ సింగ్’ అనేటైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ పూర్తిగా అర్జున్ రెడ్డి ఫ్లేవర్ లోనే కనిపిస్తోంది.  షాహిద్ సరసన భరత్ బ్యూటీ కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. ఇక ఫస్ట్ పార్ట్ కు ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల బాగా లేట్ అయింది. కానీ ఈ సారి  ఆ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. అందుకే వచ్చే యేడాది జూన్ 29న విడుదల చేస్తున్నాం అని ధీమాగా ప్రకటించారు.

More Related Stories