English   

బన్నీ భలే జాదూలే

Allu-Arjun-Trivikram
2018-10-26 12:31:54

అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఏంటీ.. గత మూణ్నాలుగు నెలలుగా అటు ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలోనూ వినిపిస్తోన్న ప్రశ్న. కానీ ఈ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పుకుండా హ్యీపీగా తన పనేదో తను చూసుకుంటున్నాడు బన్నీ. మధ్యలో కొన్ని కథలు విన్నాడు. అవేవీ నచ్చలేదు. విక్రమ్ కుమార్ తో వెళుతున్నాడు అని ఖచ్చితంగా వార్తలు వచ్చాయి. కానీ ఆ కథలో కూడా కొన్ని మార్పులు చేసినట్టు చెబుతున్నారు. దీంతో విక్రమ్ కూడా ఈ ప్రాజెక్ట్ చేయడం లేదు అని మరికొన్ని వార్తలు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా త్రివిక్రమ్ తో చేయడానికే ఇంత గ్యాప్ తీసుకున్నాడు అన్నారు. అది నిజమే అన్నట్టుగా వీరి కాంబినేషన్ లో సినిమా దసరాకు మొదలవుతుంది అనే వార్తలూ వచ్చాయి. బట్.. మరోసారి ఈ వార్తలకు పస లేదని నిరూపించేలా ఉంది అల్లు అర్జున్ వరస.

ఇక విక్రమ్ కుమార్ తో ఆల్మోస్ట్ ఓకే అయిందనుకున్న  మూవీ కూడా ఆగిపోయింది. ఇక త్రివిక్రమ్ తో ఓ బాలీవుడ్ సినిమా రీమేక్ లో నటించాలనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇవేవీ ఆ ఇద్దరూ కన్ఫార్మ్ చేయలేదు. దీంతో అసలు ఈ కాంబినేషన్ లో కూడా సినిమా డౌటే అంటున్నారు. కాకపోతే మరో కొత్త రూమర్ ఏంటంటే... అర్జున్ రీమేక్ పై ఇంట్రస్ట్ గా లేడని. అందుకే త్రివిక్రమ్ ను మరోకొత్త కథను తీసుకురమ్మని చెప్పాడని. అందుకు త్రివిక్రమ్ కూడా ఒప్పుకుని తన పాత చిట్టా విప్పి ఓ కొత్త కథ చెప్పాడని.. అంటున్నారు. మొత్తంగా ఈ కాంబినేషన్ లోనే సినిమా డిసెంబర్ లోప్రారంభం అవుతుంది అంటున్నారు. అది కూడా త్రివిక్రమ్ చెప్పినకథ పూర్తిస్థాయిలో నచ్చితేనే. అంటే అది నచ్చకపోతే మరికొన్నాళ్లు వెయిట్ చేయక తప్పని పరిస్థితి. అయినా అల్లు అర్జున్ ఒక్క ఫ్లాప్ కే ఇంత ఆత్మరక్షణలో ఎందుకు పడిపోయాడనేది ఎవరికీ తెలియడం లేదు.

More Related Stories