English   

మాస్ రాజా మొదలుపెట్టాడు

Amar-Akbar-Anthony
2018-10-26 06:35:31

మాస్ మహరాజ్ గా ఒకప్పుడు వెలిగిన రవితేజ.. కొన్నాళ్లుగా ఆ మెరుపులుచూపింలేకపోతున్నాడు.రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలతో మాగ్జిమం.. బోర్ కొడుతున్నాడు. ఇలాగే ఉంటే ఇక హీరోగా రిటైర్ కాక తప్పని పరిస్థితి. అందుకే ఈ సారి‘అమర్ అక్బర్ ఆంటోనీ’అంటూ మూడు అవతారాలెత్తాడు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ త్రిపుల్ రోల్ చేస్తున్నాడు. తనకు తోడు ఆ వైపు వరుస డిజాస్టర్స్ తో ఉన్న దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి వెళుతున్నాడు.  అటు శ్రీను కూడా ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న సినిమా కాబట్టి.. కొంత వరకూ అంచనాలున్నాయి. రీసెంట్ గా విడుదల చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ ఫస్ట్ లుక్ పోస్టర్ పెద్దగా కిక్ ఇవ్వలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ నెల 29న సాయంత్రం 4 గంటలకు టీజర్ విడుదలచేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే.. ఈ మేటర్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ బావుంది. ఇక చాలాకాలం తర్వాత ఈ మూవీతో ఇలియానా తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. తన పాత్ర కూడా సినిమాలో హైలెట్ గా ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా ఈ నెల 29తో రవితేజ, శ్రీను వైట్ల కలిసి కొత్తదనం ఉన్న కథతో వస్తున్నారా లేక అదే ఓల్డ్ వైన్ తో వస్తున్నారా అనే విషయం కొంత వరకూ తేలిపోతుుంది.

More Related Stories