English   

స‌ర్కార్ పై భారీ అంచ‌నాలు.. తెలుగులో కూడా..!

Vijay-Sarkar
2018-10-26 14:24:49

ఒక‌ప్పుడు విజ‌య్ సినిమా అంటే తెలుగులో క‌నీసం ప‌ట్టించుకునే వాళ్లు కాదు. అక్క‌డ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా తెలుగులో క‌నీస గుర్తింపు కోసం చాలా ఏళ్ల పాటు పోరాడాడు ఈ హీరో. చివ‌రికి తుపాకితో తాను ఉన్నాన‌ని.. క‌త్తి సినిమాతో గుర్తించ వ‌చ్చ‌ని.. అదిరిందితో తాను కూడా ఇక్క‌డ స్టార్ నే అని ముద్ర వేసాడు విజ‌య్. ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న స‌ర్కార్ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో అంచ‌నాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. అస‌లు స‌ర్కార్ అంటే ప్ర‌భుత్వం అని అర్థం. ఇప్పుడు విజ‌య్ న‌టిస్తున్న స‌ర్కాక్ కూడా ఇదే నేప‌థ్యంలో వ‌స్తుంది. ఈ చిత్ర టీజ‌ర్ చూస్తుంటే సినిమా కాన్సెప్ట్ ఏంటో అర్థ‌మైపోతుంది. మ‌రో రెండు నెల‌ల్లో ఎల‌క్ష‌న్స్ వ‌స్తున్న ఈ త‌రుణంలో ఓటుహ‌క్కు ప్రాముఖ్య‌త తెలిపేలా ఈ సినిమా క‌థ ఉండ‌బోతుంది. ఇందులో విజ‌య్ కార్పోరేట్ కింగ్ గా న‌టిస్తున్నాడు. 

త‌న ఓటును మ‌రొక‌రు దొంగ‌త‌నంగా వేయ‌డంతో అక్క‌డ్నుంచి క‌థ మొద‌ల‌వుతుంది. గ‌వ‌ర్న‌మెంట్ చేస్తోన్న త‌ప్పుల‌ను నిల‌దీసేలా ఈ పాత్ర ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే విజ‌య్ ఇలాంటి పాత్ర‌లు చేసాడు. గ‌తేడాది ఈయ‌న న‌టించిన మెర్స‌ల్ లో జిఎస్టీతో పాటు ఇంకా చాలా ఇష్యూస్ ను ప్రేక్ష‌కుల‌కు తెలియ‌చేసాడు. ఇప్పుడు మ‌రోసారి మురుగ‌దాస్ తో క‌లిసి ఇలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు. ఈ సారి ఇంకాస్త సీరియ‌స్ గా ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల‌పై నోరు విప్ప‌బోతున్నాడు ఈ హీరో. పైగా ఓటును త‌ప్పుగా వాడుకుంటున్న ప్ర‌జ‌ల‌కు కూడా ఈ సినిమా క‌నువిప్పుగా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఈ సినిమాపై తెలుగులో కూడా భారీ అంచ‌నాలుండ‌టం విశేషం. గ‌తంలో విజ‌య్ సినిమాల‌తో పోలిస్తే ఈ సారి ఇంకాస్త హై రేంజ్ లో వ‌స్తుంది స‌ర్కార్. కీర్తిసురేష్ హీరోయిన్ కావ‌డం.. ఆలోచింప‌జేసే క‌థ ఉండ‌టం ఈ సినిమాకు క‌లిసొచ్చే అంశాలు. మ‌రి చూడాలిక‌.. స‌ర్కార్ తెలుగులో ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతుందో..? 

More Related Stories