English   

ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ స్వ‌రం అరువిస్తున్నాడా..?

NTR-Biopic
2018-10-26 18:59:11

ఇంత‌కుముందు అయితే దీనికి స‌మాధానం నో అనే వ‌చ్చేది. కానీ ప‌రిస్థితులు ఎప్పుడు ఎలా మార‌తాయో ఎవ‌రూ చెప్ప‌లేరు. రెండు నెల‌ల కింది వ‌ర‌కు బాల‌య్య‌తో హ‌రికృష్ణ కుటుంబానికి అంతంత మాత్రంగానే సంబంధాలు ఉండేవి. ఇక బాల‌య్య కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్ తో మాట్లాడి చాలా కాలం అయిపోయింది. కానీ అనుకోకుండా హ‌రికృష్ణ యాక్సిడెంట్ లో చ‌నిపోవ‌డం.. బాల‌య్య ఆ కుటుంబానికి చేరువ కావ‌డం.. తండ్రి లేని ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ కు ఆ లోటు తీరుస్తుండ‌టంతో నంద‌మూరి అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇప్పుడు బాల‌య్య న‌టిస్తోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ లో క‌ళ్యాణ్ రామ్ త‌న తండ్రి హ‌రికృష్ణ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా త‌న‌వంతుగా ఉడ‌త సాయం చేస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. 

ఈ చిత్రానికి వాయిస్ ఓవ‌ర్ అందిస్తున్నాడ‌ని.. జూనియ‌ర్ వాయిస్ తోనే ఈ చిత్రం మొద‌లై.. ఆయ‌న వాయిస్ తోనే సినిమా న‌డుస్తుంద‌ని.. సినిమా అంతా ఈ వాయిస్ అవ‌స‌రం అయిన‌పుడు వ‌స్తూ ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ముందు ఈ సినిమాలో బాల‌య్య పాత్ర‌లో ఎన్టీఆర్ చేస్తాడ‌ని అనుకున్నారంతా.. కానీ ఇప్పుడు అది కాదు వాయిస్ ఓవ‌ర్ అయితే ఇస్తున్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై క్లారిటీ మాత్రం చిత్ర‌యూనిట్ ఇవ్వ‌డం లేదు కానీ ఎన్టీఆర్ మాత్రం తాత సినిమాలో బాబాయ్ కోసం ఈ కాస్త సాయం చేసి పెడుతున్నాడ‌ని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఒకేసారి నంంద‌మూరి కుటుంబాన్నంతా ఎన్టీఆర్ బ‌యోపిక్ లో చూస్తుంటే ఆ ర‌చ్చ థియేట‌ర్స్ లో ఎలా ఉండ‌బోతుందో..? ఆ సీన్ చూడాలంటే జ‌న‌వ‌రి 9 వ‌ర‌కు ఆగాల్సిందే. అలా ఆగితే 15 రోజుల్లోనే అంటే జ‌న‌వ‌రి 24నే మ‌రో సినిమాతో కూడా రానున్నాడు బాల‌య్య‌. మ‌రి ఈ క‌థానాయ‌కుడు.. మ‌హా నాయ‌కుడుతో క్రిష్ ఎలాంటి అద్భుతాలు చేయ‌బోతున్నాడో..? 

More Related Stories