English   

మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు 

Vaishav-Tej
2018-10-26 19:35:35

మెగా ఫ్యామిలీలో ఇప్పటికే కబడ్డి టీమ్ కు సరిపోయేంత మంది హీరోలున్నారు. మెగా ఫ్యాన్స్ ఆల్మోస్ట్ అందరినీ అభిమానిస్తున్నారు. కొందరిని విపరీతంగా అయినా మరికొందరిని మామూలుగా అయినా ఆ ఫ్యామిలీ నుంచి వస్తోన్న ప్రతి హీరోనూ ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్యామిలీ నుంచి మరో కుర్రాడు హీరోగా వస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అయితే ఈ లాంచింగ్ ఓ రేంజ్ లో ఉండబోతుండటమే విశేషం. యస్.. వైష్ణవ్ లాంచింగ్ మూవీని మైత్రీ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇందులో సుకుమార్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండబోతుండటం మరీ విశేషం. సుకుమార్ ఇందులో ఎంటర్ కావడానికి కారణం దర్శకుడు. ఈ మూవీతో కొత్త దర్శకుడు వస్తున్నాడు. అతని పేరు బుచ్చిబాబు సానా.. ఇతను సుకుమార్ శిష్యుడే. ఇతను రంగస్థలం రచయితల్లో ఒకడు కూడా. అలాగే సుకుమార్ లక్కీ మ్యాన్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు..  మొత్తంగా భారీ స్థాయిలో వైష్ణవ్ తేజ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. వైష్ణవ్ ను హీరోను చేస్తారని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. ఫైనల్ అవి ఓ రూపానికి వచ్చాయి. ఇక ఈ మూవీలో నటించే ఇతర ఆర్టిస్టులు, హీరోయిన్ టెక్నికల్ డీటెయిల్స్  తో పాటు సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది వంటీ కీలక విషయాలన్నీ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. 

More Related Stories