English   

మురుగదాస్ మళ్లీ దొరికొపోయాడు

AR-Murugadoss
2018-10-27 10:44:05

మురుగాస్.. బలమైన కథలతో వచ్చే దర్శకుడు. తన కథల్లో కాస్త సామాజిక స్పృహ కూడా కనిపిస్తుంది. అందుకే చాలా వరకూ అవి మంచి విజయాలే సాధిస్తున్నాయి. ఇంత వరకూ బానే ఉంది కానీ.. మురుగదాస్ వ్యవహారం మాత్రం తన కథల్లో కనిపించేంత నిజాయితీది కాదు. మనోడు పెద్ద కాపీ క్యాట్.. దాదాపు ప్రతి సినిమాకూ అతను ఎవరిదో ఒకరి కథను కాపీ కొడుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఈ విమర్శలు మాగ్జిమం బయటికి రాకుండా చూసుకున్నాడు. గజిని సినిమా అయితే ఓ హాలీవుడ్ మూవీకి పూర్తిగా కాపీ.  కానీ కత్తి సినిమా నుంచి విపరీతంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కత్తి సినిమా కథ నరసింహారావు అనే తెలుగు వ్యక్తిది. ఆ కథ ఓ నిర్మాతకు చెప్పాడట. అతను దాన్ని తీసుకువెళ్లి విజయ్ కి చెప్పడం.. విజయ్ మురుగదాస్ కు చెప్పడం.. అంతా ఫైనల్ అయ్యాక.. ఒరిజినల్ రైటర్ కు తెలియకుండానే.. సినిమా పూర్తయింది. అప్పట్లో సదరు నరసింహారావు అనే వ్యక్తి చాలా పెద్ద పోరాటం చేశాడు. కానీ మురుగదాస్ అస్సలు పట్టించుకోలేదు. ఫైనల్ గా తెలుగు రీమేక్ టైమ్ లో దాసరి నారాయణరావు ఆ కథకు ఆ వ్యక్తికి బాగానే ఇప్పించాడు. ఇక ఇప్పుడు మరోసారి మురుగదాస్ పై కాపీ క్యాట్ విమర్శలు వస్తున్నాయి. విచిత్రంగా ఈ సారి కూడా విజయ్ నే హీరో. ఇవి ఏకంగా అతని లేటెస్ట్ మూవీని ఆపాలని కోర్ట్ కు ఎక్కేంత వరకూ వెళ్లాయి. లేటెస్ట్ గా వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి ‘సర్కార్’ కథ నాదే అంటూ కోర్ట్ కు వెళ్లాడు. అంతే కాదు.. రైటర్స్ అసోసియేషన్ లోనూ కంప్లైంట్ చేశాడు. ఈ కథ అతను 2007లోనే ‘సెంగోల్’ అనే పేరుతో రిజిస్టర్ చేయించాడట. అదే కథను కాస్త ఇటూ అటూగా తీశాడట మురుగదాస్. దీంతో రైటర్ గా తన పేరు వేయడంతో తనకు రెమ్యూనరేషన్ కూడా ఇవ్వాలని.. అప్పటి వరకూ సినిమాను రిలీజ్ కానివ్వొద్దంటూ కోర్ట్ లో కేస్ వేశాడు సదరు రైటర్. ఇక దీపావళికి విడుదల కావాల్సి ఉన్న ఈ మూవీ ఇప్పుడు కోర్ట్ తీర్పును బట్టి విడుదల కావాల్సి ఉంటుంది. అయినా మురుగదాస్ మరీ ఇంత పెద్ద కాపీ క్యాట్ ఏంటో.. 

More Related Stories