English   

ఛ‌లో ఇట‌లీ అంటున్న ప్ర‌భాస్..

Prabhas
2018-10-27 15:24:12

కొన్ని రోజుల నుంచి రాధాకృష్ణ సినిమాతో బిజీగా ఉన్న ప్ర‌భాస్.. ఇప్పుడు మ‌ళ్లీ సాహో ద‌గ్గ‌రికి వ‌చ్చేసాడు. ఈ చిత్ర షెడ్యూల్ ఇప్పుడు ఇట‌లీలో జ‌రుగుతుంది. మొన్న‌టి వ‌ర‌కు అస‌లు సాహో ఎలా వ‌స్తుందో.. ఎలా ఉండ‌బోతుందో అనే టెన్ష‌న్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అవేవీ లేకుండా హాయిగా ఉన్నారు ప్ర‌భాస్ అభిమానులు. దానికి కార‌ణం మొన్న విడుద‌లైన మేకింగ్ వీడియో. ఇప్ప‌టి వ‌ర‌కు విజువ‌ల్ వండ‌ర్స్ అంటే కేవ‌లం హిస్టారిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో మాత్ర‌మే మ‌న ద‌ర్శ‌కులు తెరకెక్కించారు. కానీ ఒక్క‌సారి తెలుగు వాళ్లు యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్స్ చేయ‌డం మొద‌లుపెడితే ఎలా ఉంటుందో సాహొతో చూపించ‌బోతున్నాడు సుజీత్. హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమాల‌కు ధీటుగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు సుజీత్.  

మొన్న విడుద‌లైన వీడియో కూడా ఇదే చూపించింది. ఇక ఇప్పుడు ఇటలీలో మ‌రో షెడ్యూల్ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. న‌వంబ‌ర్ తొలివారం వ‌ర‌కు ఇటలీలోనే సాహో షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌భాస్ తో పాటు నీల్ నితిన్ ముఖేష్, శ్ర‌ద్ధాక‌పూర్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే దుబాయ్ లో ఫ్లైయింగ్ స్క్వాడ్ యాక్ష‌న్ సీక్వెన్సులు.. ముఖ్యంగా అక్క‌డి బూర్జ్ ఖ‌లీఫా ద‌గ్గ‌ర ప్లాన్ చేసిన  20 నిమిషాల యాక్ష‌న్ సీక్వెన్స్ ఇండియ‌న్ సినిమాల్లోనే నెవ‌ర్ బిఫోర్ అన్న‌ట్లుగా షూట్ చేసుకుని వ‌చ్చారు సుజీత్ అండ్ టీం. రుమేనియన్ కార్ చేజింగ్ సీన్స్.. ముంబై రోడ్ల‌పై భారీ ఫైట్ సీక్వెన్సులు.. ఇలా చాలా ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్.  ఈ చిత్రం క‌చ్చితంగా ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలో బెస్ట్ యాక్ష‌న్ మూవీగా నిలిచిపోతుంద‌ని భావిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఇటలీ షెడ్యూల్ తో షూటింగ్ దాదాపు పూర్తి కానుంది. 

More Related Stories