English   

పందిపిల్ల‌కు వాయిస్ ఇచ్చిన రాజేంద్ర‌ప్ర‌సాద్..

Adhugo
2018-10-27 16:18:55

అదుగో.. ఇప్పుడు ఈ చిత్రం గురించి బాగానే మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రంలో హీరో ఎవ‌రూ లేరు.. ఉన్నదంతా పందిపిల్లే. ఇదే సినిమాకు ప్రాణం. రాజ‌మౌళి ఈగ‌ను పెట్టి తీసిన‌ట్లు.. ర‌విబాబు పందిని పెట్టి తీసాడు. ఇక ఇప్పుడు ఈ పాత్ర‌కు రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌న స్వ‌రాన్ని అరువివ్వ‌డం విశేషం. ఈ సినిమాకు న‌ట‌కిరీటి వాయిస్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని ధీమాగా చెబుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ర‌విబాబు తెర‌కెక్కిస్తోన్న అదుగో చిత్రం న‌వంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. దివాళి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు. పూర్తి ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంపై ఆస‌క్తి కూడా బాగానే ఉంది. 

ఇప్ప‌టికే విడుద‌లైన అదుగో ట్రైల‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. బంటిగా పందిపిల్ల అంద‌రి మ‌న‌సుల‌ను దోచేసింది. వినోదాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు ర‌విబాబు. పందిపిల్ల నిజంగా ఉండేలా క‌నిపించడానికి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్ టెక్నాల‌జీని వాడుకున్నారు. ఓ సినిమా కోసం ఇలాంటి టెక్నాల‌జీ వాడుకోవ‌డం ఇదే తొలిసారి. అభిషేక్ వ‌ర్మ‌, న‌భాన‌టాష్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. ప్ర‌శాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఏ ఫ్లైయింగ్ ఫ్రాగ్ సంస్థ‌పై ర‌విబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. మ‌రి చూడాలిక‌.. రాజేంద్ర‌ప్ర‌సాద్ వాయిస్ఓవ‌ర్ సినిమాకు ఎంత వ‌ర‌కు హెల్ప్ కానుందో..? 

More Related Stories