English   

మ‌హేష్ బాబుతో మా..కు సంబంధం లేదు..

Mahesh-Babu
2018-10-27 17:15:45

ఇదే ఇప్పుడు హాట్ డిస్క‌ష‌న్. మా అసోసియేష‌న్ చెప్పినందుకే అమెరికాలో ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మం ఒక‌టి చేయ‌డానికి మ‌హేష్ బాబు ఒప్పుకున్నాడు అనేది ఇప్ప‌టి వ‌ర‌కు తెలిసిన వార్త‌. అయితే అది కాన్సిల్ కావ‌డం.. ఆ త‌ర్వాత ఈ ఇష్యూపై న‌మ్ర‌తా సీరియ‌స్ కావ‌డం కూడా జ‌రిగిపోయాయి. ఉన్న‌ట్లుండి అలా ప్రోగ్రామ్ కాన్సిల్ చేస్తే మ‌హేష్ ఇమేజ్ ఏమైపోతుంద‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఇప్పుడు హీరో శ్రీ‌కాంత్ నుంచి మాత్రం మ‌రో క‌థ‌నం వ‌స్తుంది. మ‌హేష్ ప్రోగ్రామ్ ఆగిపోవ‌డానికి మా అసోసియేష‌న్ కు ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పి సంచ‌ల‌నం సృష్టించాడు శ్రీ‌కాంత్. అది త‌న సొంతంగా ఛారిటీ కోసం మ‌హేష్ చేసుకున్న కార్య‌క్ర‌మం అని.. అనుకోని కార‌ణాల‌తో వాళ్లే ఆ కార్య‌క్ర‌మాన్ని ఆపేసారు అని చెప్పాడు శ్రీ‌కాంత్. కానీ ఇక్క‌డ మ‌రోలా క‌థనం వినిపిస్తుంది. టికెట్ సేల్స్ లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ ప్రోగ్రామ్ కాన్సిల్ అయింద‌ని తెలుస్తుంది. 

ఒక్కో టికెట్ ఏకంగా 100 డాల‌ర్ల‌కు పైగా పెట్ట‌డంతో అక్క‌డి ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఈ షోపై ఆస‌క్తి చూపించ‌లేదు. దాంతో నిర్వాహ‌కులు కేన్సిల్ చేసారు. ఎంత మ‌హేష్ బాబు అయితే మాత్రం ఒక్క షోకు ఏకంగా మ‌న క‌రెన్సీలో 70 వేలు అనేస‌రికి వాళ్లు కూడా దూరంగా జ‌రిగిపోయారు. దాంతో సూప‌ర్ స్టార్ షో ప‌ట్టాలెక్క‌కుండానే అట‌కెక్కింది. గ‌తంలో చిరంజీవికి కూడా ఇంచుమించు ఇలాంటి ప‌రాభ‌వ‌మే ఎదురైంది. అప్పుడు ఆయ‌న కూడా అమెరికా వెళ్లి షో చేసాడు. కానీ కేవ‌లం కోటి మాత్ర‌మే వ‌సూలు అయింది. దాంతో చిరు స్టామినా ఇంతేనా అంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు మ‌హేశ్ బాబు షో అయితే క‌నీసం మొద‌ల‌వ్వ‌కుండా ఆగిపోయింది. మొత్తానికి సినిమాలు అయితే చూస్తాం కానీ ఇలా షోల‌కు వ‌చ్చి ఎంక‌రేజ్ చేయ‌డం త‌మ వ‌ల్ల కాదంటున్నారు ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్. మొత్తానికి మ‌హేష్ ప్రోగ్రామ్ పై వినిపిస్తున్న భిన్న క‌థ‌నాల్లో దేన్ని న‌మ్మాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఉన్నారు అభిమానులు. 

More Related Stories