English   

అది నా వ‌ల్ల కాదంటున్న విశాల్.. 

Vishal
2018-10-27 19:29:17

పేరుకు త‌మిళ హీరో అయినా తెలుగులో కూడా సూప‌ర్ క్రేజ్ తెచ్చుకున్న హీరో విశాల్. పైగా తెలుగ‌బ్బాయే కావ‌డంతో మ‌నోళ్లు కూడా ఈ హీరోను  త్వర‌గానే రిసీవ్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం త‌మిళ‌నాట వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నాడు విశాల్. తాజాగా ఈయ‌న న‌టించిన పందెంకోడి 2 ప‌ర్లేద‌నిపిస్తుంది. తెలుగుతో పాటు త‌మిళ‌నాట కూడా మంచి వ‌సూళ్లే తీసుకొస్తుంది ఈ చిత్రం. ఇక ఇప్పుడు మ‌రో సినిమాకు కూడా క‌మిట‌య్యాడు విశాల్. అదే టెంప‌ర్ రీమేక్. విశాల్ కు మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉంది. అందులో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాల్లేవు. కానీ నటుడిగా విశాల్ కు ప‌రీక్ష పెట్టిన సినిమాలు చాలా త‌క్కువ‌గానే వ‌చ్చాయి. వాడువీడు సినిమా మిన‌హా విశాల్ చేసిన సినిమాల‌న్నీ మాస్ మ‌సాలా సినిమాలే. 

టెంప‌ర్ లో మాస్ తో పాటు న‌ట‌న‌కు కూడా ఆస్కారం ఉంటుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ గా ఎన్టీఆర్ ఇక్క‌డ ఇర‌గ‌దీసాడు. ఇంతే న‌ట‌న విశాల్ లో ఉందా అనేది అంద‌రికీ క‌లిగే అనుమానం. ముఖ్యంగా ఎమోష‌నల్ సీన్స్ లో ఎన్టీఆర్ దుమ్ము లేపాడు. విశాల్ లో ఇంతటి ఎమోష‌న్ ఉందా..?  టెంప‌ర్ రీమేక్ లో ముందు శింబు న‌టిస్తాడ‌ని చెప్పారు.. కానీ ఇప్పుడు అది విశాల్ చేతుల్లోకి వెళ్లింది. అయితే తాను మాత్రం ఎన్టీఆర్ చేసిన రేంజ్ లో చేయ‌లేన‌ని.. ఆ సినిమా చూసాన‌ని.. అది చూసిన త‌ర్వాత అలా చేయ‌డం నా వ‌ల్ల మాత్రం కాదంటున్నాడు విశాల్. త్వ‌ర‌లోనే ఈ చిత్ర రీమేక్ మొద‌లు కానుంది. చూడాలిక‌.. టెంప‌ర్ రీమేక్ లో విశాల్ జూనియ‌ర్ ను మ‌రిపిస్తాడో లేదో..?

More Related Stories