English   

స‌వ్య‌సాచి గ‌ట్టిగా కొడుతుంది.. రాసుకోండి..!

Naga Chaitanya Expectations on Savyasachi Revealed in Pre Release Event
2018-10-28 08:27:43

ఇది మ‌నం చెబుతున్న మాట కాదు.. నాగ‌చైత‌న్య చెప్పిన మాట‌. కంటెంట్ న‌మ్ముకుని సినిమాలు చేయ‌డం మొద‌లుపెట్టాను.. ఖచ్చితంగా ఇక‌పై మీరు గ‌ర్వ‌ప‌డే సినిమాలు చేస్తుంటాను అని ఎమోష‌న‌ల్ గా మాట్లాడాడు నాగ‌చైత‌న్య‌. స‌వ్య‌సాచి ప్రీ రిలీజ్ వేడుక‌లో ఈయ‌న చాలా జోష్ గా క‌నిపించాడు. శివ‌ప్ర‌సాద్ రెడ్డి గారు చ‌నిపోవ‌డం బాధగా ఉందంటూ ముందు త‌మ ఇంటి నిర్మాత‌ను ఓ సారి త‌లుచుకుని సినిమా గురించి చెప్ప‌డం మొద‌లుపెట్టాడు చైతూ. నిజంగా ఈ చిత్రంలో న‌టించ‌డం త‌న అదృష్టం అన్నాడు. ఈ సినిమా ఒప్పుకున్నందుకు ముందు త‌న‌ను తిట్టిన వాళ్లు కూడా ఉన్నార‌ని మొన్న చెప్పిన చైతూ.. ఇప్పుడు సినిమా చూసిన త‌ర్వాత వాళ్లే పొగుడుతారంటున్నాడు. చందూ మొండేటి రాసుకొచ్చిన క‌థ‌ను మైత్రి వాళ్లు న‌మ్మ‌డమే త‌మ విజ‌యం అని.. మాధ‌వ‌న్ ఒప్పుకున్న త‌ర్వాత సినిమా రేంజ్ మారిపోయింద‌ని చెప్పాడు.

నిధి అగ‌ర్వాల్ ఖచ్చితంగా ఈ చిత్రంతో తెలుగులో సెటిల్ అయిపోతుంద‌ని చెబుతున్నాడు చైతూ. ఈ సినిమా క‌థ అద్భుతంగా ఉంటుంద‌ని.. ఇలాంటి క‌థ‌ను డీల్ చేయ‌డం అనేది చిన్న విష‌యం కాక‌పోయినా చందూ చాలా బాగా చేసాడ‌ని చెప్పాడు చై. అంతేకాదు.. ఈ చిత్రంలో చాలా క‌మ‌ర్షియ‌ల్ అంశాలు కూడా ఉన్నాయ‌ని.. ఇది ఖచ్చితంగా త‌న కెరీర్ లో మ‌రుపురాని చిత్రంగా నిలిచిపోవ‌డం ఖాయం అంటున్నాడు చైతూ. ఇక అభిమానుల‌కు కూడా హామీ ఇచ్చాడు.. ద‌ర్శ‌కుడు చందూ మొండేటిని పిలిచి మ‌రీ కొడుతున్నాం క‌దా అని క్లారిటీ ఇప్పించాడు చైతూ. మ‌రి వీళ్ల న‌మ్మ‌కం ఎంత‌వ‌ర‌కు నిజం అవుతుందో న‌వంబ‌ర్ 2న తేల‌నుంది.

More Related Stories