English   

కీర‌వాణికి బాకీ ప‌డిపోయిన విజ‌య్ దేవ‌రకొండ‌

Vijay Devarakonda About Keeravani at Savyasachi Pre Release Event
2018-10-28 08:55:44

అదేంటి.. కీర‌వాణికి విజ‌య్ ఎలా బాడీ ప‌డ్డాడు..? అస‌లు వీళ్లిద్ద‌రికీ ఎక్క‌డా పోలిక కూడా లేదు క‌దా.. క‌నీసం క‌లిసే ఛాన్స్ కూడా లేదు ఎలా బాకీ ప‌డ్డాడు అనే అనుమానం వ‌స్తుందా..? అవును.. నిజ‌మే కానీ కీర‌వాణికి డ‌బ్బులే బాకీ ఉన్నాడు విజ‌య్. ఇది ఇప్ప‌టి బంధం కూడా కాదు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు స్టార్ అయిపోయాడు కానీ ఒక‌ప్పుడు ఈయ‌న కూడా చిన్న హీరోనే. ఓ రోజు ఫ్లైట్ లో ముంబై నుంచి హైద‌రాబాద్ వ‌స్తుంటే అదే ఫ్లైట్ లో విజ‌య్ వెన‌కాల కీర‌వాణితో పాటు ఆర్జీవి కూడా ఉన్నారు.. అప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఆకలేసి ఫ్లైట్ లో ఏదో ఫుడ్ ఆర్డ‌ర్ చేసాడు.. కానీ తీరా చేసిన త‌ర్వాత తెలిసిన విష‌యం ఏంటంటే త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని.. అప్పుడు ఆయ‌న ఆర్డ‌ర్ వేసిన ఫుడ్డుకు కీర‌వాణి బిల్ క‌ట్టాడు.

ఈ స్టోరీ అంతా ఇప్పుడు చెప్పింది కూడా విజ‌య్ దేవ‌ర‌కొండే. ఇదంతా ఒక‌ప్పుడు జ‌రిగింది అని.. నిజంగా అప్పుడు కీర‌వాణితో మంచి టైమ్ ఎంజాయ్ చేసాన‌ని గుర్తు చేసుకున్నాడు విజ‌య్. స‌వ్య‌సాచి ప్రీ రిలీజ్ వేడుక‌కు వ‌చ్చిన విజ‌య్.. గ‌త విష‌యాల‌ను గుర్తు చేసుకున్నాడు. అలాగే చైతూను కూడా జోష్ సినిమా టైమ్ లోనే అన్న‌పూర్ణ‌లో న‌ట‌న ప్రాక్టీస్ చేస్తున్న‌పుడు చూసాన‌ని గుర్తు చేసుకున్నాడు. ఏదేమైనా డ‌బ్బులు ఎన్నైనా కూడా విజ‌య్ అయితే కీర‌వాణికి అలా బాకీ ప‌డిపోయాడు. ఏదో ఓ రోజు ఆయ‌న సినిమాకు సంగీతం అందించిన‌పుడు ఆ రుణం తీర్చుకుంటాడేమో విజ‌య్ మ‌రి చూడాలిక.

More Related Stories