English   

శ్రీ రెడ్డికి బాయ్ ఫ్రెండ్ కావాలట.. కండీషన్స్ అప్లై

Controversy Me Too Founder Actress Sri Reddy Wants A Boyfriend
2018-10-28 12:59:52

వివాదాస్పద నటి, మీ టూ ఉద్యమకారిణి(చెప్పుకుంటుంది కదా) శ్రీ రెడ్డికి బాయ్ ఫ్రెండ్ కావాలట. ఇప్పటికే ఎన్నో వ్యవహారాల్లో తెలుగు రాష్ట్రాల్లో తెగ ఫేమస్ అయిన ఈ ముదురు భామకు ఓ తోడు కావాలట. ప్రస్తుతం మకాం చెన్నైకి మార్చింది. అక్కడ ఓ ఇళ్లు కూడా కొనుక్కుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో కొన్ని ఆఫర్స్ దక్కించుకున్న శ్రీ రెడ్డి తనకో బాయ్ ఫ్రెండ్ కావాలంటూ ట్విట్టర్ లో పెట్టింది. ఈ బాయ్ ఫ్రెండ్ విషయంలో అమ్మడు చాలా కోరికలే చెప్పింది. అయితే ఆ బాయ్ ఫ్రెండ్ కూడా కేవలం ‘చెన్నైవాడే’’ కావాలట. ఇక తన బాయ్ ఫ్రెండ్ కు ఉండాల్సిన ‘‘క్వాలిఫికేషన్స్’’ కూడా చెప్పింది.. మరి ఈ తోడు కోసం అమ్మడు పెట్టిన ట్వీట్ ఎలా ఉందో తెలుసా..

‘‘ ఫస్ట్ దేవుడిని సీరియస్ గా ఓ విషయం అడిగాను. ఓ మంచి బాయ్ ని ఫ్రెండ్ ఇవ్వమని.. అతను నా గతం గురించి పట్టించుకోకూడదు.. నా పట్ల బాధ్యతగా ఉండాలి.. నాకు పూర్తిగా టైమ్ కేటాయించాలి.. అలాంటి బాయ్ ని ఫ్రెండ్ గా ఇవ్వమని’’ అంటూ ట్వీట్ చేసింది. మరి ఈ ట్విస్ట్ ఏంటో కానీ.. ట్విట్టర్ లో శ్రీ రెడ్డిపై తెగ సెటైర్స్ వేస్తున్నారు కుర్రాళ్లు. మరి శ్రీ రెడ్డి త్వరలోనే అలాంటి బాయ్ ఫ్రెండ్ దొరకాలని మనమూ కోరుకుందాం.. అప్పుడైనా తను బుద్దిగా ఉంటుందేమో..!

More Related Stories