English   

వామ్మో అంత న‌మ్మ‌క‌మేంటి బాబు..?

Director Chandoo Mondeti Confidents on Savyasachi
2018-10-28 14:33:48

ఎవ‌రైనా ద‌ర్శ‌కుడు త‌మ సినిమా గురించి చెప్పుకోడానికి విడుద‌ల‌కు ముందు మిగిలి ఉన్న ఏకైక వేడుక ప్రీ రిలీజ్. అందులోనే తాము ఇంత క‌ష్ట‌ప‌డ్డాం.. అంత చేసాం అంటూ చెప్పుకుంటారు. చెప్పుకోవాలి కూడా. అయితే ఇప్పుడు చందూ మొండేటి మాత్రం చాలా భిన్నం. ఈయ‌న న‌వంబ‌ర్ 2న స‌వ్య‌సాచి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌లో ఈయ‌న మాట్లాడిన టైమ్ ఎంతో తెలుసా.. అక్ష‌రాలా 11 సెక‌న్లు. ఆ టైమ్ లో ఏం మాట్లాడాడు అనుకుంటున్నారా.. చాలా మాట్లాడాల‌ని ఉందండీ.. విడుద‌ల త‌ర్వాత మాట్లాడుకుందాం అంటూ స్పీచ్ ముగించేసాడు చందూ మొండేటి.

Savyasachi Director Chandoo Mondeti

ఈ ఒక్క మాట చాలు సినిమాపై మ‌నోడు ఎంత కాన్పిడెంట్ గా ఉన్నాడో చెప్ప‌డానికి. త‌న తొలి సినిమా కార్తికేయ కూడా ఇలాగే చాలా రోజుల పాటు వాయిదా ప‌డి ప‌డి విడుద‌లైంది.. సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్పుడు స‌వ్య‌సాచికి కూడా ఇదే జ‌రుగుతుంది. ఇదే సెంటిమెంట్ క‌లిసొస్తుంద‌ని న‌మ్ముతున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే ఈయ‌న కూడా తొలి రెండు సినిమాల‌తో హిట్ కొట్టాడు. కార్తికేయ‌తో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టి.. ప్రేమ‌మ్ తో మంచి విజ‌యం అందుకున్నాడు. ఇక ఇప్పుడు మూడో సినిమాగా స‌వ్య‌సాచితో వ‌స్తున్నాడు. ఈ చిత్రం ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత ఖచ్చితంగా హ్యాట్రిక్ ఖాయం అనే న‌మ్మ‌కంతో ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈయ‌న కానీ హ్యాట్రిక్ అందుకున్నాడంటే ఖచ్చితంగా చందూ చుట్టూ హీరోలు చేర‌డం ఖాయ‌మే. మ‌రి చూడాలిక‌.. విడుద‌ల త‌ర్వాత ఈయ‌న ఎన్ని విష‌యాలు మాట్లాడ‌బోతున్నాడో..?

More Related Stories