English   

మహేష్ థియేటర్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు

Mahesh Babu Join Hands With Asian Multiplex for Movie Theatres Business
2018-10-28 16:53:18

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇప్పటికే ‘M.B’ ప్రొడక్షన్స్ బ్యానర్ పెట్టి కొన్ని సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోన్న సూపర్ స్టార్ కొన్నాళ్ల క్రితం థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అవి నిజమే. ఆయన కొత్తగా కొన్ని థియేటర్స్ నిర్మించి ఎగ్జిబిటర్ గానూ మారబోతున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్న ఏసియన్ సినిమాస్ తో కలిసి పార్టనర్ గా మారాడు మహేష్ బాబు. మహేష్ బాబు పార్టనర్ గా ఏసియన్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇకపై తెలంగాణతో పాటు ఆంధ్రలోనూ విస్తృతం కానుంది. ఇందుకోసం ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో థియేటర్స్ నిర్మాణం మొదలైంది. ఇందులో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ లో నిర్మించిన మల్టీప్లెక్స్ ఓపెనింగ్ ముహూర్తం సెట్ చేసుకున్నారు.

నవంబర్ 8న మహేష్ బాబు, ఏసియన్ సినిమాస్ తో కలిసి నిర్మించిన మల్టీప్లెక్స్ ఓపెనింగ్ జరగబోతోంది. ఈ జాయింట్ వెంచర్ ప్రాడక్ట్ మహేష్ బాబు చేతుల మీదుగానే ఓపెనింగ్ జరగబోతోంది. గచ్చిబౌలీలో నిర్మించిన ఈ ఆధునిక మల్టీప్లెక్స్ లో మొదటి సినిమా ఏంటో తెలుసా.. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పీరియాడికల్ డ్రామా సినిమాతో మహేష్ బాబు థియేటర్ బిజినెస్ మొదలు కాబోతోందన్నమాట. మొత్తంగా ఈ కొత్త బిజినెస్ లో మహేష్ బాబు ఎలా రాణిస్తాడో చూడాలి. ఇక అతను నటిస్తోన్న ‘మహర్షి’ సినిమా ప్రస్తుతం యూఎస్ఏలో చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడి నుంచి మహేష్ బాబు ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కోసం నవంబర్ 6న హైదరాబాద్ వస్తాడట.

More Related Stories