English   

తెలుగు దీపావళి ‘సర్కార్’ దేనా..?

Vijay’s Sarkar Movie Releasing Deepavali in Huge Theatres at Telugu States
2018-10-29 07:37:30

తెలుగువారికి పండగలంటే కొత్త సినిమా పోస్టర్స్ కూడా. ఇక దీపావళి లాంటి పండగలకు సినిమావాళ్లు కూడా పెద్ద ఇంపార్టెన్సే ఇస్తారు. కానీ ఈ సారి మన తెలుగు నుంచి పెద్ద సినిమాలేవీ రావడం లేదు. ఉన్న సినిమాలకు బజ్ కూడా లేదు. దీంతో ఈ దీపావళికి డబ్బింగ్ సినిమా దందా సాగేలా ఉంది. నిజానికి దీపావళి పండగ సందర్భంగా నిఖిల్ నటించిన ‘ముద్ర’ విడుదల కాబోతోంది. కానీ ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకూ పెద్దగా సందడి మొదలు కాలేదు. వారం రోజుల్లోనే హైప్ తీసుకురావడం.. థియేటర్స్ కు ఆడియన్స్ ను రప్పించడం నిఖిల్ వంటి మీడియం రేంజ్ హీరోకు అసాధ్యం. అందువల్ల ముద్ర వచ్చి సినిమా హిట్ టాక్ తెచ్చకున్నా గట్టి ముద్ర వేస్తుందని చెప్పలేం. ఇక రవిబాబు పందిపిల్లతో చేసిన ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’ కూడా దీపావళి బరిలోకి హడావిడీగా వచ్చేసింది. మనవాళ్లు మరి ఈ పిగ్ లెట్ సినిమాను ఎంత వరకూ ఆదరిస్తారనేది డౌటే. ఈ నేపథ్యంలో తమిళ్ నుండి డబ్బింగ్ సినిమాగా వస్తోన్న సర్కార్ పైనే అందరి దృష్టి ఉంది. అందుకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు అనువాద నిర్మాతలు.

ఏఆర్ మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో వస్తోన్న సర్కార్ పై భారీ అంచనాలున్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన తుపాకీ, కత్తి సినిమాలు అక్కడ రికార్డులు క్రియేట్ చేశాయి. ఆ రెండు సినిమాలూ ఇక్కడా విజయ వంతం అయ్యాయి. కత్తి సినిమాను తెలుగులో ఖైదీ నెంబర్ 150గా చిరంజీవి రీమేక్ చేసి రీ ఎంట్రీ ఇచ్చాడు. తుపాకీ ఇప్పటికీ మనవారికి ఫేవరెట్ మూవీ. అదీ కాక ఈ మధ్య పోలీసోడు, అదిరింది వంటి డబ్బింగ్ సినిమాలతో మనవాళ్లను ఆకట్టుకుంటున్నాడు విజయ్. పైగా తెలుగు సర్కార్ ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాను ఏకంగా 750 థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. విజయ్ కెరీర్ లో ఇది తెలుగులో భారీ స్థాయి రిలీజ్. ఈ సినిమా హిట్ అయితే విజయ్ ఎన్నాళ్లుగా చూస్తోన్న తెలుగు మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా ఇలాంటి పండగను మనవాళ్లు చూస్తూ చూస్తూ.. ఓ డబ్బింగ్ సినిమాకు కట్టబెట్టడం మాత్రం బాలేదు.

More Related Stories