English   

మొత్తానికి ఓపెనింగ్ డేట్ చెప్పారయ్యా

Finally Allu Arjun Confirmed a Movie After Naa Peru Surya Disaster
2018-10-29 01:07:36

అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఎప్పుడు.. గత కొన్ని నెలలుగా అభిమానులకే కాదు పరిశ్రమ నుంచి కూడా వినిపిస్తోన్న ప్రశ్న. కానీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకుండా నాన్చుతున్నాడీ స్టైలిష్ స్టార్. బట్ ఫైనల్లీ.. అందరి నీరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తన కొత్త సినిమా ఓపెనింగ్ డేట్ చెప్పేశాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత అల్లు అర్జున్ కొత్త సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆ సినిమా బాగా డిజప్పాయింట్ చేయడంతో రీ థాట్ లో పడ్డాడు. మంచి కథల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో చాలామంది దర్శకులు చెప్పిన కథలు విన్నాడు. వింటున్నాడు కూడా. మధ్యలో విక్రమ్ కుమార్ కథ నచ్చిందన్నారు. బట్.. సెకండ్ హాఫ్ అల్లు అర్జున్ కు పెద్దగా నచ్చలేదు. దీంతో మళ్లీ వెయిటింగ్. ఈ వెయిటింగ్ ఇన్నాళ్లకు ఫుల్ స్టాప్ పడింది. పైగా ముందు నుంచీ ఊహిస్తోన్న దర్శకుడితోనే వెళ్లబోతోన్నాడు.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి కథలు ఆడియన్స్ కు బాగా నచ్చాయి. నిర్మాతలకు డబ్బులూ తెచ్చాయి. దీంతో ఈ కాంబినేషన్ పై క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను హ్యాట్రిక్ గా మలచడానికి ఈ ఇద్దరూ మరో సినిమాతో రాబోతున్నారు. రీసెంట్ గా ఇది ఓ బాలీవుడ్ మూవీకి రీమేక్ అనే వార్తలు వచ్చాయి. కానీ కాదట. త్రివిక్రమ్ మళ్లీ ఓ కొత్తకథతోనే వస్తున్నట్టు టాక్. మొత్తంగా ఎన్నాళ్లో వేచిన ముహూర్తం డిసెంబర్ 11న సెట్ అయింది. డిసెంబర్ 11న అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అఫీషియల్ గా ప్రారంభం కాబోతోంది.

More Related Stories