English   

వెల్ క‌మ్ టూ టాలీవుడ్ మాధ‌వ‌న్.. 

Madhavan-savyasachi
2018-10-29 13:21:11

మాధ‌వ‌న్.. ఈ పేరు తెలియ‌ని వాళ్లుండ‌రేమో..? ఒక‌ప్పుడు అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు. ఇప్పుడు భిన్నమైన సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్. హీరోగా ఇమేజ్ ఉండి కూడా కంటెంట్ ఉన్న సినిమాల్లో మాత్రమే న‌టిస్తున్నాడు మ్యాడీ. ఈ మ‌ధ్య కాలంలో మ‌రీ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. గ‌త రెండు మూడేళ్ల‌లో సాలాఖ‌డూస్.. త‌నూవెడ్స్ మ‌నూ రిట‌ర్న్స్.. విక్ర‌మ్ వేధ లాంటి సినిమాలు చేసాడు మాధ‌వ‌న్. అంతేకాదు.. ఈయ‌నకు భాషా భేదాలు లేవు. ఇప్ప‌టికే తమిళ్ తో పాటు మ‌ళ‌యాల‌, హిందీల్లోనూ న‌టించాడు. ఇక ఇప్పుడు తెలుగులో నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రంతోనే తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు ఈయ‌న‌. ఎట్ట‌కేల‌కు ఇన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత త‌న‌కు తెలుగు ప్రేక్ష‌కులను నేరుగా క‌లుసుకునే అవ‌కాశం వ‌చ్చింద‌ని చెప్పాడు మ్యాడీ. స‌వ్య‌సాచి ప్రీ రిలీజ్ వేడుక‌లో మాట్లాడుతూ తెలుగులో న‌టించాల‌ని చాలా కాలంగా చూస్తున్నాన‌ని.. ఇన్నాళ్లకు రైట్ స్క్రిప్ట్ వ‌చ్చింద‌ని చెప్పాడు. 

ఇక‌పై వ‌రస అవ‌కాశాలు వ‌స్తే ఇక్క‌డే న‌టించ‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని కూడా చెప్పాడు మ్యాడీ. ఈ సినిమా న‌వంబ‌ర్ 2న విడుద‌ల కానుంది. ఇందులో విల‌న్ గా న‌టిస్తున్నాడు మాధ‌వ‌న్. వ‌య‌సు 48 దాటిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కు ధీటుగా త‌న ఫిజిక్ మెయింటేన్ చేస్తున్నాడు మాధ‌వ‌న్. ఇప్ప‌టికే ఇందులో మ‌నోడి యాక్ష‌న్ కు అంతా ఫిదా అయిపోతున్నారు. ల‌వ‌ర్ బాయ్ గా క‌నిపిస్తున్నా కూడా రాక్ష‌సంగా విల‌నిజం కూడా చూపిస్తున్నాడు. ఇప్ప‌టికీ ఇంత ఫిట్ గా ఎలా ఉన్నారు అంటే దానికి స‌మాధానంగా సాయంత్రం 6 గంటల తరువాత ఎలాంటి ఆహరాన్నీ తీసుకోనని.. రోజులో తీసుకునే రెండు భోజనాలకు మధ్య ఐదున్నర గంటల సమయం విరామం తీసుకోవటమే త‌న ఫిట్ నెస్ సీక్రేట్ అంటున్నాడు మ్యాడీ. మొత్తానికి ఈయ‌న తెలుగు ఇండ‌స్ట్రీకి రావ‌డం మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. రేపు సినిమా హిట్టైతే ఇంకెంత గంతులేస్తాడో..? 

More Related Stories