English   

శ్రీదేవికి ఇచ్చిన మాటకోసం అజిత్ ఏం చేస్తున్నాడో తెలుసా..?

Ajith-Boney-Kapoor
2018-10-29 07:04:51

ఓ స్టార్ హీరోగా కోలీవుడ్ లో అజిత్ కు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. అలాంటి అజిత్ చనిపోయిన శ్రీదేవికి ఓ మాట ఇచ్చాడు. ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాలో తను ఓ గెస్ట్ రోల్ చేశాడు. ఇది కేవలం శ్రీదేవి పై ఉన్న అభిమానంతోనే చేశానని చాలాసార్లు చెప్పుకున్నాడు అజిత్. అందుకే ఈ మూవీకి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. అతను చేసిన గెస్ట్ రోల్ ను హిందీలో అమితాబ్ బచ్చన్ చేయడం విశేషం. అప్పుడు శ్రీదేవి తమ బ్యానర్ లో ఓ తమిళ సినిమా చేయాలని అజిత్ ను అడిగింది. అందుకు అజిత్ ఓకే చెప్పాడు. ఈ లోగా అనుకోకుండా శ్రీదేవి చనిపోయింది. ఆమె లేదు కదా అని ఆ మాటను పట్టించుకోకుండా వదిలేయడం లేదు అజిత్. శ్రీదేవి అంటే తనకెంతో ఇష్టం అని ఎన్నోసార్లు చెప్పుకున్న అజిత్ ఆమెకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు అజిత్. 

శ్రీదేవికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. అజిత్ బోనీకపూర్ నిర్మిస్తోన్న సినిమాలో నటించేందుకు ఆల్రెడీ డేట్స్ కూడా ఇచ్చాడు. అయితే ఇది ఓ రీమేక్. రీసెంట్ గా బాలీవుడ్ లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్ ఇది. అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఓ కోర్ట్ డ్రామా. అయితే అజిత్ ఇమేజ్ కు తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారు. కార్తీ హీరోగా నటించిన సూపర్ హిట్  మూవీ ‘తీరన్ అధిగారమ్ ఒండ్రు’ చిత్ర దర్శకుడు హెచ్. వినోద్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో ఖాకీగా విడుదలై ఇక్కడా సూపర్ హిట్ అయింది. మొత్తంగా అజిత్ శ్రీదేవికి ఇచ్చిన మాట ప్రకారం బోనీ కపూర్ కు డేట్స్ ఇచ్చాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలపైకి రానుంది. ఇక అజిత్ ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో చేసిన విశ్వాసం సినిమాను వచ్చేయేడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు.. ఈ లోగానే ఈ కొత్త సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. అన్నీ కుదిరితే బోనీకపూర్ నిర్మించే ఈ సినిమా వచ్చే యేడాది దీపావళికి విడుదల కావొచ్చంటున్నారు. 

More Related Stories