English   

అమర్ అక్బర్ ఆంటోనీ టీజ‌ర్.. క‌సి క‌న‌బ‌డుతుంది.. 

Amar-Akbar-Anthony
2018-10-29 09:32:52

మ‌నం ఆపద‌లో ఉన్న‌పుడు మ‌న‌ల్ని కాపాడేది మ‌న చుట్టూ ఉండే బ‌ల‌గం కాదు.. మ‌న‌లో ఉన్న బ‌లం. ఇది మ‌నం చెప్పిన మాట కాదు.. ర‌వితేజ చెబుతున్న మాట‌. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ టీజ‌ర్ విడుద‌లైంది. తొలి టీజ‌ర్ లో క‌థ ఏం చెప్ప‌క‌పోయినా ఈ సారి మాత్రం కాస్త రివీల్ చేసాడు. రివేంజ్ డ్రామాతోనే అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ వ‌స్తున్నార‌ని అర్థం అయిపోతుంది టీజ‌ర్ చూస్తుంటే. దాన్ని మ‌రింత కొత్తద‌నంతో స్క్రీన్ ప్లే రాసుకున్నాడు శీనువైట్ల‌.

టీజ‌ర్ చూస్తుంటే శీనువైట్ల ప‌క్కా ప‌క‌డ్భంధీగానే వ‌స్తున్న‌ట్లు తెలుస్తుంది. ర‌వితేజ కూడా చాలా స్టైలిష్ గా ఉన్నాడు. మూడు పాత్ర‌ల‌ను బాగానే హైలైట్ చేసాడు ద‌ర్శ‌కుడు. కామెడీ లాంటివి క‌నిపించ‌లేదు.. సునీల్ జాడ లేదు.. ఇలియానా కూడా సింపుల్ గా సింగిల్ ఫ్రేమ్ తో క‌నిపించింది. యాక్ష‌న్ సీక్వెన్సులు కాస్త ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. ముగ్గురు కారెక్ట‌ర్స్ బాగానే హైలైట్ చేసినా కూడా వాటి మ‌ధ్య రిలేష‌న్ ఏంటి అనేది మాత్రం తెలియ‌కుండా బాగానే స‌స్పెన్స్ మెయింటేన్ చేసారు. న‌వంబ‌ర్ 16న విడుదల కానుంది ఈ చిత్రం. మొత్తానికి టీజ‌ర్ చూసిన త‌ర్వాత సినిమాపై అంచ‌నాలు భారీగానే పెరిగిపోయాయి. 

More Related Stories