English   

నవంబర్ లో ఒకటి, డిసెంబర్ లో ఒకటి అంటోన్న సుమంత్ 

Sumanth
2018-10-29 18:14:48

సుమంత్.. కొన్నాళ్ల క్రితం ఫేడవుట్ అయిపోయినట్టే అనుకున్నవాడు కాస్తా సడెన్ గా ‘మళ్లీరావా’తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అతని కెరీర్ కు కొత్త బూస్టప్ ఇచ్చిన మళ్లీరావాతో సుమంత్ ఈ సారి మరీ లేట్ చేయాలనుకోలేదు. అందుకే ఇమేజ్ ను పట్టించుకోకుండా కొత్త దర్శకులు చెప్పిన కొత్త కథలకు కమిట్ అవుతూ వెళుతున్నాడు. ఈ క్రమంలో ఒకేసారి రెండు డిఫరెంట్ స్టోరీస్ ను ఓకే చేశాడు. ఆశ్చర్యంగా ఈ రెండు సినిమాలూ ఇప్పుడు ఒకేసారి పూర్తయ్యాయి కూడా. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సుమంత్ చేసిన ట్వీట్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతేడాది డిసెంబర్ లో వచ్చిన మళ్లీరావా తర్వాత మరోసారి డిసెంబర్ లో రావడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇన్ డైరెక్ట్ గా అనౌన్స్ చేశాడు సుమంత్. అది కూడా రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటైనా డిసెంబర్ లో వచ్చే అవకాశం ఉంది. 

ప్రస్తుతం సుమంత్ ‘ఇదం జగత్’, ‘సుబ్రహ్మణ్యపురం’ అనే సినిమాలు చేసి ఉన్నాడు. రీసెంట్ గా ఈ రెండు సినిమాలూ పూర్తయ్యాయట. వీటిలో ముందు మొదలుపెట్టింది ‘సుబ్రహ్మణ్యపురం’. ఈ సినిమాతో సంతోష్ జగలపూడి అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఇది డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ కథ. మరో సినిమా ఇదం జగత్.. ఇది కూడా కొత్తదర్శకుడే చేసిన సినిమా. అనిల్ శ్రీకంఠం అనే కుర్రాడు ఇదం జగత్ కు దర్శకుడు. ఇది కూడా సస్పెన్స్ డ్రామానే కావడం విశేషం. మొత్తంగా ఈ రెండు సినిమాలూ పూర్తయ్యాయని.. వీటిలో ఇదం జగత్.. నవంబర్ లో వస్తుందని.. సుబ్రహ్మణ్యపురం డిసెంబర్ లో విడుదలవుతుందని ఆల్మోస్ట్ అనౌన్స్ చేశాడు సుమంత్. మరి ఈ రెండు సినిమాలో  ఏఒక్కటి హిట్ అయినా ఇక సుమంత్ కెరీర్ కు ఇప్పట్లో బ్రేకులు పడవు.. కాకపోతే.. 

More Related Stories