English   

క‌లం ప‌ట్టిన చేతికే బేడీలు.. కుల‌శేఖ‌ర్ అరెస్ట్.. 

kulasekhar-arrested
2018-10-29 19:37:55

మిలీనియం మొద‌ట్లో ఆయ‌న పాట‌లు సంచ‌ల‌నం. ఏం పాట రాసినా కూడా అద్భుత‌మే. ఒక‌ప్పుడు ఆయ‌న పాట‌లంటే ప్రేక్ష‌కుల‌తో పాటు నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు కూడా పిచ్చెక్కిపోయేవాళ్లు. కానీ ఆ త‌ర్వాత మెల్ల‌గా ఆయ‌న్ని విధి కాటేసింది. టాలెంటెడ్ రైట‌ర్ కాస్తా అనారోగ్యం పాల‌య్యాడు. త‌న‌ను తాను కూడా గుర్తు ప‌ట్ట‌లేని స్టేజ్ కు వెళ్లిపోయాడు. ఆ త‌ర్వాత మ‌రిచిపోయాడు.. జీవితాన్ని బ‌త‌క‌డం కూడా మ‌రిచిపోయాడు. క‌ట్టుకున్న భార్య కూడా వ‌దిలేసింది. ఈ క‌థ అంతా కుల‌శేఖ‌ర్ దే. ఒక‌ప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌న పాట‌లు రాసిన ఈ రైట‌ర్ ఇప్పుడు పోలీసుల ఎదుట దోషిగా నిల‌బ‌డ్డాడు. అది కూడా దొంగ‌త‌నం కేస్ లో. ఒక‌ప్పుడు ఎన్నో మంచి మంచి పాట‌లు రాసిన ఈయ‌న క‌రం ఇప్పుడు దొంగ‌త‌నాల‌కు అల‌వాటు ప‌డింది. కొన్ని రోజులుగా హైద‌రాబాద్ మోతీనగర్‌లో ఉంటున్న ఈయ‌న‌.. అక్టోబ‌ర్ 28 ఉద‌యం ఓ గుళ్లో పూజారి బ్యాగు దొంగిలించాడు.
 
అందులో 50 వేల విలువైన 10 మొబైల్స్ ఉన్నాయి. దాంతో పాటు పోలీసులు ప‌ట్టుకున్న‌పుడు ఆయ‌న ద‌గ్గ‌ర్నుంచి 45వేల విలువచేసే బ్యాగులు.. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు.. తాళంచెవులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు త‌ల‌రించారు. రెండేళ్ల కింద కూడా కాకినాడ‌లో ఇలాగే ఓ గుళ్లో శఠగోపం దొంగిలించాడు. ఆ కేసులోనే ఆర్నెళ్లు జైలుశిక్ష కూడా అనుభ‌వించి వ‌చ్చాడు కుల‌శేఖ‌ర్. దీనికి కార‌ణం కూడా లేక‌పోలేదు. కేవ‌లం పూజారుల‌ను టార్గెట్ చేయ‌డానికి కార‌ణం.. ఒక‌ప్పుడు ఆయ‌న రాసిన ఓ పాట‌తో అప్పుడు బ్రాహ్మ‌ణులంతా కుల‌శేఖ‌ర్ ను బ‌హిష్క‌రించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తున్నాడు కుల‌శేఖ‌ర్. మొత్తానికి విధి వైప‌రిత్యం అంటే ఇదే కాబోలు. స‌రస్వ‌తి పుత్రుడులా ఉన్న కులశేఖ‌ర్ ఇప్పుడు జైలుప‌క్షి అయిపోయాడు. 

More Related Stories