English   

రామ్ చ‌ర‌ణ్ టార్గెట్ మిస్సయ్యేలా ఉన్నాడే..!

Ram Charan Boyapati Movie Will Come on Sankranti Or Postpone
2018-10-30 07:41:18

రామ్ చ‌ర‌ణ్ సంక్రాంతికి వ‌స్తున్నాడా..? అస‌లు వ‌స్తున్నాడా అని.. ఇప్పుడు అంద‌రిలోనూ వ‌స్తున్న అనుమానం. అదేంటి.. ఖచ్చితంగా వ‌స్తాం అని నిర్మాత దాన‌య్య చెప్పాడు క‌దా అనుకుంటున్నారా..? క‌రెక్టే కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదని చెబుతున్నారు విశ్లేష‌కులు. ముఖ్యంగా ఈ చిత్ర షూటింగ్ ఇంకా నెల రోజుల‌కు పైగానే బ్యాలెన్స్ ఉంద‌ని తెలుస్తుంది. ఇలాంటి స‌మ‌యంలో కెమెరా మెన్ కూడా మారిపోయాడు. దాంతో అనుకున్న టైమ్ కు సినిమా వ‌స్తుందా రాదా అనేది అంద‌రిలోనూ వ‌స్తున్న అనుమాన‌మే. అయితే బోయ‌పాటి శీను మాత్రం ఖచ్చితంగా అనుకున్న స‌మ‌యానికి ఔట్ పుట్ ఇచ్చేయాల‌ని చూస్తున్నాడు. కానీ రామ్ చ‌ర‌ణ్ సినిమాలు మాత్రం కొన్ని ఏళ్లుగా ఒక్క‌టి కూడా అనుకున్న టైమ్ కు విడుద‌ల కావ‌డం లేదు.

రంగ‌స్థ‌లం కూడా ముందు సంక్రాంతికి అనుకుని ఆ త‌ర్వాత మార్చ్ కు వెళ్లింది. ఇప్పుడు బోయ‌పాటి సినిమా కూడా ఇదే జ‌రుగుతుందేమో అనిపిస్తుంది చూస్తుంటే. పైగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఒక్క లుక్ కూడా విడుద‌ల చేయ‌లేదు ద‌ర్శ‌కుడు. టైటిల్ కూడా చెప్ప‌ట్లేదు. ఈ విష‌యంలో చాలా వెన‌కాలే ఉన్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్. ఈ జ‌రుగుతున్న ఆల‌స్యం చూస్తుంటే ఖచ్చితంగా సంక్రాంతికి రావ‌డం అసాధ్యం అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని పవర్ ప్యాక్డ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నాడు బోయ‌పాటి. గ్యాంగ్ లీడ‌ర్ త‌ర‌హాలో ఈ చిత్రం ఉండ బోతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి చూడాలిక‌.. ఈ సస్పెన్స్ కు తెర‌దించి అనుకున్న టైమ్ కు సినిమాను విడుద‌ల చేస్తాడో లేదో..?

More Related Stories