English   

కూటి కోసం రాశీఖ‌న్నాకు ఒకటే విద్య.

Actress Rashi Khanna Alternative Focus On Tamil Industry
2018-10-30 11:03:16

రాశీఖ‌న్నా.. ఈ పేరుతో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో చాలా సినిమాలు చేసింది.. ఇక్క‌డ విజ‌యాలు కూడా అందుకుంది. కానీ ఇప్పుడు లేవు క‌దా.. అందుకే మ‌నోళ్లు ప‌ట్టించుకోవ‌డం మానేసారు. శ్రీ‌నివాస క‌ళ్యాణం ఫ్లాప్ త‌ర్వాత అమ్మ‌డు తెలుగులో క‌నిపించ‌డం క‌రువు అయిపోయింది. ప్ర‌స్తుతం త‌మిళ్ ఇండ‌స్ట్రీపై దృష్టి పెట్టింది రాశీఖ‌న్నా. రెండేళ్ల కింది వ‌ర‌కు తెలుగు త‌ప్ప మ‌రో భాష‌లో సినిమాలే చేయ‌ని రాశీఖ‌న్నా.. ఇప్పుడు త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల‌పై కూడా ఫోక‌స్ పెట్టింది. విల‌న్ సినిమాతో కేర‌ళ‌కు వెళ్లిన ఈ బ్యూటీ.. అక్క‌డ తొలి సినిమాతోనే షాక్ తినేసింది. దాంతో ఇప్పుడు త‌మిళ్ ఇండ‌స్ట్రీపై ఫోకస్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌.

Actress Rashi Khanna Alternative Focus On Tamil Industry

ఇప్పుడు త‌మిళ్ లో జ‌యంర‌వి హీరోగా సుభాష్ సినిమాలో న‌టిస్తుంది రాశీఖ‌న్నా. ఇది తెలుగులో కూడా అనువాదం అవుతుంది కానీ పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండేలా క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు ఈ చిత్ర ప్ర‌మోషన్స్ తోనే బిజీగా ఉంది రాశీఖ‌న్నా. తెలుగులో ఈ మ‌ధ్యే విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ర్వాతి సినిమాలో న‌టించే అవ‌కాశం అందుకుంది రాశీఖ‌న్నా. క్రాంతి మాధ‌వ్ దీనికి ద‌ర్శ‌కుడు. మొత్తానికి ఛాన్స్ ఉన్న‌పుడు తెలుగులో న‌టిస్తూనే.. ఆల్ట‌ర్ నేటివ్ గా మ‌రో ఇండ‌స్ట్రీని కూడా ఫోక‌స్ చేస్తుంది రాశీఖ‌న్నా.

Actress Rashi Khanna Alternative Focus On Tamil Industry

More Related Stories