English   

ఒక్క కీర‌వాణికే ద‌క్కిన అదృష్టం అది..

MM-Keeravani
2018-10-30 11:47:32

రీమిక్స్ సాంగ్స్ ట్రెండ్ ఎప్ప‌ట్నుంచో ఇండ‌స్ట్రీలో ఉంది. తండ్రులు.. తాత‌ల పాట‌ల‌ను వార‌సులు రీమిక్స్ చేస్తుంటారు. ఇది కామ‌న్. కానీ పాత పాట‌ల‌ను రీమిక్స్ చేసేట‌ప్పుడు సంగీత ద‌ర్శ‌కులు మారిపోతుంటారు. దాంతో ఒరిజిన‌ల్ కు ఉన్న అందం పోతుంది. ఈ విషయంలో కీర‌వాణి మాత్రం ఓ అరుదైన రికార్డ్ సెట్ చేస్తున్నాడు. ఈయ‌న త‌న పాట‌ల్ని త‌నే రీమిక్స్ చేసుకోవ‌డం విశేషం. సాధార‌ణంగా ఇలాంటి ఆఫ‌ర్లు మ‌రే సంగీత ద‌ర్శ‌కుడికి రావు. కానీ కీర‌వాణికి వ‌చ్చింది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చి పాతికేళ్లు దాటేసింది. ఈ త‌రం వార‌సులు పాతికేళ్ల కంటే ముందు పాట‌ల్ని తీసుకోవ‌డం లేదు. దాంతో కీర‌వాణి త‌న పాట‌ల్ని తానే రీమిక్స్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మ‌గ‌ధీర‌లోని బంగారు కోడిపెట్ట ఉంది.. ఈ పాట‌ని అప్పుడు చిరంజీవికి కొట్టింది కూడా ఈయ‌నే. 

ఘ‌రానామొగుడు కీర‌వాణి కెరీర్ లో మేజ‌ర్ బ్రేక్. అదే పాట‌ను ఇప్ప‌టి త‌రానికి త‌గ్గ‌ట్లుగా రీమిక్స్ చేసాడు కీర‌వాణి. ఇప్పుడు స‌వ్య‌సాచిలో నిన్ను రోడ్డుమీద చూసిన‌ట్లు ల‌గ్గాయ‌త్తు పాట‌ను రీమిక్స్ చేస్తున్నారు. అల్ల‌రి అల్లుడులోని ఈ పాట‌కు కూడా కీర‌వాణే స్వ‌రాలందించాడు. ఇప్పుడు కొత్త పాట‌కు కూడా ఆయ‌నే రీమిక్స్ స్వ‌రాలు అందిస్తున్నాడు. నిజానికి ఇలాంటి అవ‌కాశం ఎవ‌రికో కానీ ఒక్క‌సారి కూడా రాదు. ఇప్పుడు విడుద‌లైన పాట అంత‌గా వినిపించ‌క‌పోయినా కూడా ఆల్బ‌మ్ లో క‌చ్చితంగా ఊపు ఇచ్చే పాట అయితే ఇదే. విన‌గానే అక్కినేని అభిమానులు ఎక్క‌డ‌లేని ఉత్సాహంతో ఉన్నారు. మొత్తానికి కీర‌వాణికి రెండుసార్లు త‌న పాట‌ను త‌నే రీమిక్స్ చేసుకునే అవ‌కాశం వ‌చ్చింది. మ‌రి చూడాలిక‌.. కీర‌వాణి ఇలా ఇంకెన్ని పాట‌ల‌ను రీమిక్స్ చేస్తాడో..?

More Related Stories