English   

నితిన్ ను ఆయ‌న కాపాడ‌గ‌ల‌డా.. అంత ద‌మ్ముందా..? 

Nithiin
2018-10-30 14:00:19

ఎప్పుడూ బ్రాండ్ నే కాదు.. అప్పుడ‌ప్పుడూ క‌థ‌ను కూడా న‌మ్ముకోవాలి. అలా చేసిన‌పుడు నితిన్ కు హిట్ వ‌చ్చింది. కానీ ఎప్పుడైతే బ్రాండ్ మోజులో ప‌డ్డాడో అప్ప‌ట్నుంచీ బ్యాండ్ మొద‌లైంది. కావాలంటే చూడండి.. 12 ఫ్లాపుల త‌ర్వాత నితిన్ కు హిట్ ఇచ్చింది స్టార్ డైరెక్ట‌ర్ కాదు.. అప్ప‌టికి తెలుగులో సినిమా చేసి 11 ఏళ్లైన విక్ర‌మ్ కే కుమార్. ఈ చిత్రం త‌ర్వాత గుండెజారి గ‌ల్లంత‌యిందే అంటూ నితిన్ కు బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చింది విజ‌య్ కుమార్ కొండా అనే కొత్త ద‌ర్శ‌కుడు. కానీ పూరీ క‌థ న‌మ్మి ఎప్పుడైతే హార్ట్ ఎటాక్ చేసాడో అప్పుడే షాక్ తిన్నాడు. ఆ త‌ర్వాత కూడా క‌రుణాక‌ర‌ణ్ తో చిన్న‌దాన నీ కోసం చేసి చేతులు కాల్చుకున్నాడు. 

త్రివిక్ర‌మ్ ఒక్క‌డే నితిన్ కు హ్యాండివ్వ‌కుండా ఉన్నాడు. అ..ఆతో హిట్టిచ్చినా.. రైట‌ర్ గా మాత్రం షాక్ ఇచ్చాడు త్రివిక్ర‌మ్. ఈయ‌న రాసిన చ‌ల్ మోహ‌న్ రంగా నితిన్ కు ఫ్లాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు దిల్ రాజు బ్యాన‌ర్ లో బ్రాండ్ న‌మ్ముకుని చేసిన శ్రీ‌నివాస క‌ళ్యాణం కూడా డిజాస్ట‌రే. ఈ చిత్రం త‌ర్వాత ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు ఈ కుర్ర హీరోకు. ఇప్పుడు వెంకీ కుడుముల‌తో ఓ సినిమా ఇప్ప‌టికే క‌మిట‌య్యాడు. ఛ‌లో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన ఈ ద‌ర్శ‌కుడు త‌న కెరీర్ కు మ‌లుపు అందిస్తాడని న‌మ్ముతున్నాడు నితిన్. ఇక ఈయ‌న‌తో పాటు ఇప్పుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటిని కూడా లైన్ లో పెట్టాడు. మ‌రి ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు నితిన్ కోరుకున్న విజ‌యం అందిస్తారో చూడాలిక‌..! 

More Related Stories