English   

ఫ్రస్టేటెడ్ డైరెక్టర్.. కొట్టేసిన హీరో

Sree-Vishnu
2018-10-30 16:26:28

ఒక రివ్యూ.. మంచి సినిమాను చంపేస్తుందా..? అంటే ఒకప్పుడేమో కానీ.. ఇప్పుడైతే అసాధ్యం. ఎందుకంటే థియేటర్ నుంచి బయటకు వచ్చి.. ఇంటికో ఆఫీస్ కో వెళ్లి అతను రివ్యూ రాసేకంటే ముందే.. థియేటర్ బయటే సినిమా ఫ్యూచర్ చెప్పేస్తున్నారు ఆడియన్స్.. యూ ట్యూబ్ లు విపరీతంగా పెరిగిన తర్వాత.. ఈట్రెండ్ రివ్యూస్ వచ్చే వరకూ ఆగడం లేదన్నది నిజం. మరోవైపు మంచి సినిమాను కూడా చంపేసే రోజులు కావివి. ఎవరైనా మంచి సినిమాను బాలేదని రాస్తే.. పబ్లిక్ గానే బూతులు తిట్టేస్తున్నారు జనం.. సో.. రివ్యూస్ సినిమా బావుందా లేదా అనేది చెబుతాయి కానీ.. సినిమాను విజయాన్ని శాసించలేకపోతున్నాయి నేటి రోజుల్లో.. కానీ ఈ విషయం అర్థం చేసుకోలేకపోయిన ఓ కొత్త దర్శకుడు పాపం.. అదే పనిగా రివ్యూవర్స్ ను విమర్శిస్తూ తెగ ఫ్రస్టేట్ అయిపోతున్నాడు. 

లేటెస్ట్ గా వీరభోగ వసంతరాయలు అనే సినిమా వచ్చింది కదా. ఈ చిత్ర దర్శకుడు ఇంద్రసేన. రిలీజ్ కు ముందు చాలాఅంచనాలుపెంచాడు. కానీతర్వాత వాటిని అందుకోవడం లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. తను బాగా తీయకపోవడం వల్ల సినిమా ఆడలేదు అనేది పక్కన బెట్టి.. రివ్యూస్ బాగా రాయకపోవడం వల్లే సినిమా పోయిందనేలా ఫీలవుతూ... అందరు రివ్యూవర్స్ పై సెటైర్స్ వేస్తూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. పోనీ కుర్రాడేదోఫ్రస్టేషన్ లో ఉన్నాడనుకున్నారు. అయితే సినిమా విషయయంలో అతనికి కౌంటర్స్ ఇస్తోన్న కామన్ ఆడియన్ పైనా.. బూతులతో విరుచుకుపడుతున్నాడు. దీంతో ఇలాగే ఉంటే ప్రమాదం అనుకున్న హీరో శ్రీ విష్ణు.. అతని ట్వీట్స్ కు తమకు ఏం సంబంధం లేదన్నట్టుగా మరో ట్వీట్ చేశాడు. 

ప్రస్తుతం సోషల్ మీడియాలోఈ దర్శకుడు ఇంద్రసేన పోస్ట్ లకు తగిలేలా.. శ్రీ విష్ణు.. ‘లేటెస్ట్ గా ఓ ఎక్స్ పర్మెంట్ చేశాం. కానీ అది బాలేదు. అయినా రివ్యూస్ ను, రివ్యూవర్స్ ను నేను ఎప్పుడూ రెస్పెక్ట్  చేస్తా అంటూ.. తన నెక్ట్స్ సినిమాతో ఖచ్చితంగా అలరిస్తా’నని ప్రామిస్ చేశాడు. దీంతో ఇంద్రసేన వాదనలను శ్రీ విష్ణు కొట్టేసినట్టైంది. ఏదేమైనా ఓ మంచి సినిమా తీసి.. నిజంగానే రివ్యూవర్స్ పాడు చేశారనుకుంటే ఇలా వారిపై సెటైర్స్ వేయొచ్చు. కానీ తీసిందేఓ నాసిరకం సినిమా. పైగాఈ డాంబికాలు.. అవసరమా ఇంద్రసేనా.. ఇలా చేస్తే నీకు మళ్లీ కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయా నాయనా..?

More Related Stories