English   

స్ట్రాంగ్ లిప్ లాక్ ఇచ్చిన స్టార్ హీరో కూతురు..?

Saif Ali Khan Daughter Sara Ali Khan Lip Lock in Kedarnath Teaser
2018-10-30 17:35:46

కొన్నిసినిమాలు చూస్తుంటే అనివార్యంగా పాత సినిమాలు గుర్తొస్తాయి. అఫ్ కోర్స్ వీటిలో ఉండే స్టఫ్ టైమింగ్స్ వేరయినా.. అవి అలా కనిపించడంలో తప్పేం ఉండదు. లేటెస్ట్ గా బాలీవుడ్ నుంచి వస్తోన్న ‘కేదార్ నాథ్’ మూవీ టీజర్ చూస్తే అలాగే అనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం కేదార్ నాథ్ లో వచ్చిన వరదల చుట్టూ అల్లుకున్న ప్రేమకథ ఇదని టీజర్ చూస్తేనే తెలిసిపోతోంది. ధోనీ బయోపిక్ తో బాలీవుడ్ లో తనకంటూ ఓ ఫేమ్ క్రియేట్ చేసుకున్న సుశాంత్ రాజ్ పుత్ హీరోగా నటిస్తోన్న సినిమా ఇది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ఈ మూవీతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అమ్మడు ఫస్ట్  మూవీతోనే ఓ ఘాటైన లిప్ లాక్ ఇచ్చేసింది.

Saif Ali Khan Daughter Sara Ali Khan Lip Lock in Kedarnath Teaser

అప్పట్లో కేదార్ నాథ్ వరదలు మళ్లీ వస్తే.. అందులో చిక్కుకున్న తన ప్రేయసి కోసం హీరో తన ప్రాణాల్నే రిస్క్ చేస్తే అనే ఈ కాన్సెప్ట్ చూస్తుంటే టైటానిక్ గుర్తుకు రాక మానదు. చుట్టూ సముద్రం నుంచి తన ప్రేయసిని కాపాడ్డానికి హీరో చేసిన త్యాగమే.. ఆ సినిమా విజయానికి మెయిన్ రీజన్. ఇదీ అలాగే కనిపిస్తోంది. కాకపోతే కాస్త డివోషనల్ కూడా మిక్స్ చేసినట్టున్నారు. మొత్తంగా ఓ మంచి కమర్షియల్ హిట్ కోసం చూస్తోన్న సుశాంత్ కు కేదార్ నాథ్ ఆ కోరిక నెరవేర్చేలానే ఉంది. అటు హీరోయిన్ కు కూడా కమర్షియల్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన లక్ దక్కుతుంది. బట్ ఏ మాటకామాటే.. సారా అలీఖాన్ ఫస్ట్ మూవీతో బెస్ట్ ఇంప్రెషన్ వేసేలా కనిపించడం లేదు. అందంగానే కనిపిస్తోంది.. కానీ ఏదో స్పార్క్ మిస్ అయినట్టుగా తెలుస్తోంది. శ్రీదేవి కూతురులా తనది చూడగానే ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్ కాదనిపిస్తోంది.

Saif Ali Khan Daughter Sara Ali Khan Lip Lock in Kedarnath Teaser

More Related Stories