English   

దేవరకొండ - శివ సినిమా మొదలవుతోందా..?

Vijay-Devarakonda
2018-10-30 19:05:19

కొరటాల శివ.. ఓ సినిమా మొదలుపెడుతున్నాడంటే.. అది హిట్టే.. అనే బ్రాండ్ సంపాదించుకున్నాడు. వరుస విజయాలతో.. అతి తక్కువ టైమ్ లోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. భరత్ అనేనేను.. సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న కొరటాల.. నెక్ట్స్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు. అంటే ఈ మూవీ వచ్చే యేడాది ప్రారంభం కానుంది.  ఈ లోగా చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ పూర్తి చేస్తాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటూ చాలా రోజులుగా వార్తలువస్తోన్నాయి. ఫైనల్ గా ఈ కాంబినేషన్ రెడీ అయింది. ఇదే టైమ్ లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తోంది. కొరటాల శివ.. చిరంజీవి సినిమా పూర్తయిన తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నాడు.

ఇటు విజయ్ దేవరకొండ కూడా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. నవంబర్ లో టాక్సీవాలా విడుదల కాబోతోంది. వరుసగా ప్రస్తుతం డియర్ కామ్రేడ్ తో పాటు క్రాంతిమాధవ్ డైరెక్షన్ లోనూ ఓసినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలూ వచ్చే యేడాది వరకూ పూర్తవుతాయి. అటు కొరటాల శివ, చిరంజీవి సినిమా కూడా 2020 సంక్రాంతికి వస్తుంది. ఆ లోగానే విజయ్ దేవరకొండ, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుంది. ఒక రకంగా ఇది విజయ్ రేంజ్ ను పెంచే సినిమాగానే చెప్పాలి. కొరటాల శివ ఇప్పటి వరకూ స్టార్ హీరోలతోనే సినిమా చేశాడు. అఫ్ కోర్స్ .. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా పెద్ద స్టారే. రీసెంట్ గా తను విజయ్ తో సినిమా చేస్తానని చెప్పాడు శివ. అది క్యాజువల్ గా చెప్పాడు అనుకున్నారు చాలామంది. బట్ ఇది అఫీషియల్ అని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించిన పూర్తి వార్తలు రాబోతున్నాయి.

More Related Stories