English   

క్లైమాక్స్ తో మొదలుపెడుతోన్న రాజమౌళి

Rajamouli
2018-10-30 19:18:23

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రారంభానికి ముందే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’. రాజజమౌళి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించిన కాస్ట్ విషయంలో కేవలం హీరోలు మాత్రమే తెలిశారు. హీరోయిన్లెవరు..?  ఇతర ప్రధాన పాత్రలు ఎవరు చేస్తున్నారు వంటి విషయాలు ఇంకా ప్రకటించలేదు. ఇక నవంబర్ నుంచి అఫీషియల్ గా షూటింగ్ కు వెళ్లబోతోన్న  ఈ మూవీని క్లైమాక్స్ తో మొదలుపెట్టబోతున్నాడు రాజమౌళి. ఇందుకోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెటప్ కూడా సిద్ధం చేశారట. క్లైమాక్స్ కాబట్టి ఇద్దరు హీరోలుండాలి కదా.. ప్రస్తుతం జూనియర్ రెడీగా ఉన్నాడు. అటు రామ్ చరణ్ కూడా బోయపాటి సినిమా నుంచి ఈ షూటింగ్ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేసుకోబోతున్నాడు.

దాదాపు 45 రోజుల పాటు ఈ క్లైమాక్స్ షెడ్యూల్ జరుగుతుందట. అంటే భారీ షెడ్యూల్ అనుకోవచ్చు.  ఈ మొత్తం షెడ్యూల్ లో అత్యధిక శాతం ఫైట్ చిత్రీకరణకే కేటాయిస్తున్నారంటే ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అనుకోవచ్చు. ఎన్టీఆర్ సిద్ధంగానే ఉన్నాడు కాబట్టి.. ముందుగా అతని ఎపిసోడ్ చిత్రీకరిస్తారట. తర్వాత చరణ్ డేట్స్ ను బట్టి అతని ఎపిసోడ్స్ ఉంటాయి. తర్వాత అనుకున్నట్టుగానే ఇద్దరూ కలిసి ఉండే సీన్స్ కోసం క్లియర్ గా ఇప్పటికే షెడ్యూల్ కూడా వేసినట్టు టాక్. అన్నట్టు ఈ మూవీ కోసం ఎన్టీఆర్ మళ్లీ లుక్ మారుస్తుున్నాడని టాక్. ఏదేమైనా రాజమౌళి క్లైమాక్స్ తో మొదలుపెట్టడం ఆశ్చర్యంగానే ఉంది.

More Related Stories