English   

రాజశేఖర్ భలే లక్కీలే..?

Rajasekhar
2018-10-30 19:29:03

లక్ అంటే రాజశేఖర్ దే. అసలు కెరీరే  పోయింది అనుకుంటోన్న టైమ్ లో సడెన్ గా వచ్చిన.. ‘గరుడవేగ’.. బ్లాక్ బస్టర్ అతని కెరీర్ ను మరోసారి రైజ్ చేసింది. దీంతో మళ్లీ స్పీడ్ పెంచాడీ యాంగ్రీయంగ్ మేన్. వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం ‘అఁ’ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ‘కల్కి’ అనే సినిమా చేస్తున్నాడు. 1980స్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ టైటిల్ తోనే ఆకట్టుకున్నాడు ప్రశాంత్ వర్మ. లోగో డిజైనింగ్ అద్భుంగా ఉందనే టాక్ వచ్చింది. మొత్తంగా ప్రస్తుతం చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీకి కొత్త హీరోయిన్ దొరికింది. 

నిజానికి ఇప్పుడు ఓల్డ్ హీరోలకు సినిమాలైతే బాగా ఉన్నాయి.. కానీ హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ రాజశేఖర్ కు ఆ గొడవ లేదు. ఏకంగా హార్ట్ ఎటాక్ బ్యూటీతో రొమాన్స్ చేయబోతున్నాడు. హార్ట్ ఎటాక్ తో ఆకట్టుకుని.. క్షణంతో మెప్పించిన ఆదాశర్మకు ఆ తర్వాత అనుకున్నంత క్రేజ్ కానీ ఆఫర్స్ కానీ రాలేదు. ఈ టైమ్ లో తన కథకు ఆదాశర్మ అయితే బావుంటుందని దర్శకుడు భావించాడు. ఈ టైమ్ లో ఏ దర్శకుడైనా రాకపోతాడా అని ఎదురుచూస్తోన్న ఆదాకు ఆ ఆఫర్ నచ్చింది. వెంటనే రాజశేఖర్ తో రొమాన్స్ కు ఓకే చెప్పింది. దీంతో అసలు కెరీరే అయిపోయిందనుకున్న రాజశేఖర్ కు ఆదాతో రొమాన్స్ చేసే అవకాశం రావడం లక్ కాకపోతే ఇంకేంటీ..?

More Related Stories