English   

అఖిల్ డాన్స్ చేసి ఫైట్ చేస్తే కంప్లీట్ అవుతుంది

Akhil Akkineni’s Mr Majnu Shooting Pending Only Two Songs and Fight Scenes
2018-10-31 07:12:34

అఖిల్ ఇప్పుడు గాళ్ ఫ్రెండ్ తో బిజీగా ఉన్నాడు. అదేంటి.. సినిమాలు వ‌దిలేసి గాళ్ ఫ్రెండ్ తో తిర‌గ‌డం ఏంటి అనే అనుమానం రావ‌చ్చు కానీ అఖిల్ దృష్టిలో మాత్రం గాళ్ ఫ్రెండ్ అంటే ఆయ‌న ఎప్పుడు ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తే అత‌డే. అలా ఇప్పుడు ఈయ‌న గాళ్ ఫ్రెండ్ పేరు వెంకీ అట్లూరి. ఈ ఇద్ద‌రూ క‌లిసి మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు ఊహించిన రెస్పాన్స్ అయితే రాలేదు కానీ బాగానే ఉంది. అఖిల్ ఇందులో ప్లే బాయ్ గా న‌టిస్తున్నాడు. చాలా రోజులుగా షూటింగ్ స్టేజ్ లోనే ఉన్న ఈ చిత్రం ఇప్పుడు టాకీ ఫినిష్ చేసుకుంది. ఇంకో రెండు పాట‌లు.. రెండు ఫైట్లు మిన‌హా షూటింగ్ అంతా పూర్త‌యింద‌ని చెప్పారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

అవి కూడా న‌వంబ‌ర్ లోనే పూర్తి చేస్తామంటున్నారు. అయితే ఈ చిత్రం మాత్రం ముందుగా అనుకున్న‌ట్లు డిసెంబ‌ర్ లో రావ‌డం క‌ష్ట‌మే. డిసెంబ‌ర్ 21 అనుకున్నా కూడా అప్పుడు అంత‌రిక్షం.. ప‌డిప‌డి లేచే మ‌న‌సు.. యాత్ర లాంటి సినిమాలు వ‌స్తున్నాయి. దాంతో వాటితో పోటీ ఎందుకు అని అఖిల్ సైలెంట్ గా సైడ్ ఇస్తున్నాడు. పైగా గ‌తేడాది డిసెంబ‌ర్లో వ‌చ్చిన హ‌లో పెద్ద‌గా ఆడ‌లేదు. అందుకే వెంకీ అట్లూరి త‌న‌కు క‌లిసొచ్చిన ఫిబ్ర‌వరిలో మిస్ట‌ర్ మ‌జ్ను విడుద‌ల చేస్తున్నాడు. ఆ నెల్లోనే ఈయ‌న తొలి సినిమా తొలిప్రేమ విడుద‌లైంది. ఇప్పుడు ఏడాది త‌ర్వాత అఖిల్ తో వ‌స్తున్నాడు. మ‌రి చిన‌బాబు ఏం చేస్తాడో చూడాలి..!

More Related Stories