English   

అక్క‌డ మ‌హేష్ బాబు ప‌నైపోయింది

Mahesh Babu and Maharshi Team Will be returned to India on 2nd November
2018-10-31 07:31:09

అదేంటి మ‌హేష్ బాబు ప‌నైపోవ‌డం ఏంటి.. ఆయ‌న ఇంకా సూప‌ర్ స్టార్ క‌దా అనుకుంటున్నారా..? ప‌నైపోవ‌డం అంటే అలా కాదు.. మ‌రోలా. మ‌హ‌ర్షి సినిమాతో ఇప్పుడు ఈయ‌న బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ అమెరికాలో జ‌రుగుతుంది. అక్టోబ‌ర్ మొద‌ట్లో అక్క‌డ షూటింగ్ కు వెళ్లాడు సూప‌ర్ స్టార్. ఆయ‌న‌తో పాటు మ‌రో 30 మంది టీం కూడా వెళ్లారు. నెల రోజుల భారీ షెడ్యూల్ త‌ర్వాత ఇప్పుడు ఈ షూటింగ్ కు ప్యాక‌ప్ చెప్పారు. న‌వంబ‌ర్ 2న హైద‌రాబాద్ వ‌స్తున్నారు మ‌హేష్ అండ్ టీం. వ‌చ్చీ రాగానే ఇక్క‌డ కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న త‌ర్వాత మ‌ళ్లీ షూటింగ్ తో బిజీగా మారిపోతున్నాడు మ‌హేష్. వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్న మ‌హ‌ర్షి ఇప్ప‌టికే 50 శాతం పూర్తి చేసుకుంది.

మూడు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసాడు ద‌ర్శ‌కుడు. ఇదిలా ఉంటే ఈ చిత్రం స్వ‌దేశ్ ఆధారంగా తెర‌కెక్కుతుంద‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై చిత్ర‌యూనిట్ స్పందించ‌లేదు కానీ వంశీ పైడిప‌ల్లి మాత్రం కేవ‌లం థీమ్ మాత్ర‌మే తీసుకుని క‌థ సొంతంగా రాసుకున్నాడ‌ని తెలుస్తుంది. రైతుల క‌థ‌తో మ‌హ‌ర్షి తెర‌కెక్కుతుంది. యుఎస్ షెడ్యూల్ పూర్తి కావ‌డంతో న‌వంబ‌ర్ మూడో వారం నుంచి హైద‌రాబాద్ లోనే కొత్త షెడ్యూల్ మొద‌లు పెట్ట‌నున్నారు. పూజాహెగ్డే కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటుంది. ఇక అల్ల‌రి న‌రేష్ సైతం ఈ షెడ్యూల్ కి వ‌స్తాడు. ఫిబ్ర‌వ‌రి నాటికి ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి మార్చ్ అంతా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్.. ఏప్రిల్ 5న సినిమా విడుద‌ల చేయ‌నున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

More Related Stories